Perni Nani : వాల్తేరు వీరయ్య ఈవెంట్‌లో చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభుత్వం ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాలి కాని ఇలా సినిమా ఇండస్ట్రీపై పడి ఏడుస్తుందేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైపీపీ నాయకులు చిరంజీవిపై ఎదురు దాడి చేస్తున్నారు. పేర్ని నాని, అంబటి, కొడాలి నాని వంటి వారు చిరంజీవిపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన పేర్ని నాని.. వాల్తేర్ వీరయ్య రెండు వందల రోజులు ఆడడం సంతోషంగా ఉందని అన్నారు. ఒకప్పుడు తాను కూడా అభిమానిని అని, అప్పట్లో చిరంజీవి కటౌట్లకు తాను ఒక ఫ్యాన్‌గా దండలు వేశానని గుర్తు చేశారు.
చిరంజీవి సినిమాని సినిమాగా.. రాజకీయాల్ని రాజకీయంగా చూడాలని పేర్ని నాని అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి ఏపీ సచివాలయానికి ఎంత దూరమో.. ఏపీ సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్‌కి అంతే దూరమని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పటి వరకు సినిమా హీరోలపై మాట్లాడిందా అని అడిగారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, రాం చరణ్ మీద ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. వారి రెమ్యునరేషన్ గురించి ఎవరైనా అడిగారా అని అన్నారు. ‘‘ఒక మంత్రిపై కక్షతో సినిమాలో పాత్రలు పెట్టారు. మరి విమర్శలు ఎదుర్కోక తప్పదు. గిల్లితే గిల్లించుకోవాలి అని సినిమాలో చెప్పినట్టు ఉండదు. బాహ్య ప్రంపంచంలో గిల్లినపుడు గిల్లుతారు. ఇది సినిమా కాదు. సినిమాలో మంత్రి పాత్ర పెట్టారు కాబట్టి ఇలా కామెంట్స్ వస్తున్నాయి’’ అని పేర్ని నాని అన్నారు.
పుంగనూరు ఘటనలో ప్రధాన ముద్దాయి చంద్రబాబు అని, అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు.పుంగనూరులో బాబు రౌడీయిజానికి పాల్పడ్డారని, పోలీసులపై దాడులు చేసి అల్లర్లు సృష్టించాలని కుట్ర పన్నారని ఆయన విమర్శించారు. పక్కా స్కెచ్‌తోనే చంద్రబాబు రెక్కీ చేయించారని, ముందు రోజే రాళ్లు, కర్రలు దాచి పెట్టారని ఆరోపించారు. పక్క జిల్లా నుంచి రౌడీ మూకలను తెచ్చి మోహరించాని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ రిషాంత్ రెడ్డి కళ్లకు ఆపరేషన్ చేయిస్తాననటం లోకేష్ బలుపు అని, పోలీసులకు కులం ఉంటుందా? అని ప్రశ్నించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…