Roja : సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా పలు సినిమాలు చేసింది. అనంతరం జబర్ధస్త్‌తో పాటు పలు షోలకి జడ్జిగా వ్యవహరించింది. ఇక రాజకీయాలలోను తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఏపీ పర్యాటక శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఆమె ప్రస్తుత పాలిటిక్స్‌లో ఫైర్‌బ్రాండ్‌గా కొనసాగుతూ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అయితే రోజా తాజాగా తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలు తెలియజేసి అందరిని ఆశ్చర్యంలో పడేశారు.
చామంతి సినిమా షూటింగ్ సమయంలో సెల్వమణితో ప్రేమలో పడ్డ రోజా అనంతరం పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరి వైవాహిక బంధానికి గుర్తింపుగా అన్షుమాలిక్ అనే కుమార్తె, కృష్ణ కౌశిక్ అనే కుమారుడు ఉన్నారు. కాగా రోజాకున్న అనారోగ్య సమస్యల కారణంగా ఒకనొక సందర్భంలో ఆమెకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారట. అయితే భగవంతుని దయ వల్ల తనకు అమ్మనయ్యే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన వృత్తి, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ.. తనకు ఫైబ్రాయిడ్ సమస్య ఉంది అని చెప్పింది.
నాకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత 2000 సంవత్సరంలో లాప్రోస్క్రోపీ సర్జరీ జరిగింది. ఇది జరిగిన రెండేళ్లకు అంటే 2002లో మా పెళ్లయింది. 2003లో నాకు పాప (అన్షు మాలిక్) పుట్టింది. అయితే గర్భం దాల్చగానే ఆ విషయాన్ని మా డాక్టర్‌కు చెప్పాను. దాంతో తెగ సంతోషించింది.నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు. అందుకే నిన్ను కరుణించాడని హర్షం వ్యక్తం చేసింది. అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదు అనుకుంటున్న సమయంలో అన్షు నా కడుపున పుట్టింది. అందుకే నాకు పాపంటే ప్రాణం.. నా ఇద్దరు పిల్లలకు వారికి నచ్చినట్లే వారి జీవితాలు ఉండాలనుకుంటాను’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది రోజా.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…