Pathan Movie : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఒకప్పుడు లవ్ స్టోరీ మూవీలకే ప్రాధాన్యం ఇచ్చేవాడు.. క్రమంగా పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. అలా సుదీర్ఘ కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన ఇటీవలి కాలంలో విజయాలను అందుకోవడంలో విఫలం అవుతోన్ననేపథ్యంలో కొంత గ్యాప్ తీసుకొని పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది. షారూఖ్ నటించిన ఈ మూవీ ఐదారు వారాల నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
పఠాన్ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టడమే కాక నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఈ క్రమంలో పఠాన్ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖన్ హీరోగా నటించిన పఠాన్ మూవీలో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ.. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించింది. జాన్ అబ్రహం విలన్ క్యారెక్టర్ లో నటించగా.. ఇందులోని యాక్షన్, షారుక్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ బాలీవుడ్ జనాలకు బాగా నచ్చేయడంతో మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఓటీటీలో ఈ మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాల్సి ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…