Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో రచ్చచేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాతో జాన్వీకపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. తొలుత ఈ సినిమాలో అలియాభట్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అలియా కూడా ఎన్టీఆర్ సినిమా కోసం తనను చిత్ర యూనిట్ సంప్రదించిన మాట వాస్తవమేనని వెల్లడించింది. కానీ పెళ్లి, ప్రెగ్నెన్సీ వల్ల ఆమె ఈ సినిమా నుంచి వైదొలిగింది.
అలియా స్థానంలో మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ చాలా కాలంగా అన్వేషణ సాగించగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు వినిపించింది. కానీ సౌత్, బాలీవుడ్ సినిమాలతో ఆమె డేట్స్ అడ్జెస్ట్ కావడం కష్టం కా్పోవడంతో చివరికి వారందరిని కాదని ఈ అవకాశం జాన్వీకపూర్‌ను వరించినట్లు సమాచారం. ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ కపూర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం ఆమె ఏకంగా రూ. 5 కోట్లు చార్జ్ చేస్తుందట.
‘ప్రాజెక్టు K’ మూవీ కోసం దీపికా పదుకొణె ఏకంగా రూ. 10 కోట్లు తీసుకుంటుండగా, ఆమె తర్వాత అత్యధిక మొత్తం చార్జ్ చేస్తున్న హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నిలిచినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగులో టాప్ హీరోయిన్లు, రష్మిక మందన్న, పూజాహెగ్డే కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ను జాన్వీ అడిగినట్టు తెలుస్తుండగా, ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న చాలా మంది నోరెళ్లపెడుతున్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…