Avatar 2 : సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన విజువల్ వండర్ మూవీ ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బిజినెస్‌ను జరుపుకున్న విషయం తెలిసిందే . ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 22వ తేదీన ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫుల్ రన్‌లో ఈ మూవీ రెండు బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 16423 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. ఈ సినిమాను ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిందే అంటూ థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అందించారు ప్రేక్షకులు.
అవతార్ 2 సినిమా ఆస్కార్ బరిలో పలు విభాగాల్లో నామినేట్ కావడంతో, ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాకు ఎన్ని అవార్డులు దక్కుతాయా అనే అంశంపై పడింది. ఇక ఓటీటీలో వస్తే ఈ సినిమా చూడాలని తహతహలాడుతున్న ప్రేక్షకులకి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను మార్చి 28వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. ఇందులో భాగంగా మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్ లో రచ్చ లేపిన ఈ సినిమా ఓటీటీలో ఎంత పెద్ద హిట్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యమే ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’. మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా దాదాపు 350 – 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. ఇందులోని గ్రాఫిక్స్ ప్రేక్షకులకి కనుల పండుగగా నిలిచాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…