Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పుడు వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలె ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ఇప్పుడు వరల్డ్ కప్‌లో కూడా సత్తా చాటుకుంటుందని అనుకుంటున్నారు. వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన ఫోన్‌ను మర్చిపోయాడు. అదేంటి ప్రాక్టీస్‌లో పడిపోయి ఫోన్‌ను ఎలా మర్చిపోయారు. ఇది ఎక్కడ జరిగింది. ఫోన్ పోయిన తర్వాత రోహిత్ శర్మ ఏం చేశాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చెందిన ఐఫోన్ చోరీకి గురైంది. .
ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేసుకున్న తర్వాత చూసుకోగా తన ఫోన్ పోయిందని గుర్తించినట్లు తెలిపాడు. దీంతో తన ఫోన్ పోయిందని స్థానిక అధికారులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోహిత్ శర్మ చేసిన ఫిర్యాదుతో అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి ఫోన్‌ను వెతికిపెట్టే పనిలో పడినట్లు తెలిపారు. అయితే గతంలో కూడా రోహిత్ శర్మ తన వస్తువులు మర్చిపోయిన సంఘటనలు ఉన్నాయి. దీంతో రోహిత్‌కు మతిమరుపు ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక వరల్డ్ కప్ ట్రోఫీలో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో భారత్ మూడో వన్డేలో రాజ్‌కోట్ వేదికగా తలపడింది. అయితే ఈ వన్డేకు ముందు మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో చెమటోడ్చాడు. అయితే ప్రాక్టీస్ తర్వాత తన ఐఫోన్ పోయినట్లు రోహిత్ శర్మ గుర్తించాడు.
దీంతో అక్కడ అంతా వెతికినా తన ఫోన్ మాత్రం దొరకలేదు. దీంతో పోలీసులు, గ్రౌండ్ సిబ్బందితోపాటు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కూడా రంగంలోకి దిగి ఫోన్ వెతికే పనిలో పడినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. అయితే ఆ ఫోన్‌ను ఎవరో దొంగిలించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాధారణంగా రోహిత్ శర్మకి తన వస్తువులు మరచిపోయే అలవాటు ఉందని ఇంతకుముందు కొన్ని సందర్భాలను బట్టి చూస్తే తెలుస్తోంది. అదే విధంగా తన మొబైల్‌ను ఎక్కడో మరచిపోయి ఉంటాడేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఆసియా కప్ ముగించుకున్న తర్వాత రోహిత్ సేన కొలంబో నుంచి ముంబైకి బయలుదేరింది. అప్పుడు రోహిత్ శర్మ తన పాస్‌పోర్టును హోటల్ రూమ్‌లో మర్చిపోయాడు. బస్సు ఎక్కిన తర్వాత పాస్‌పోర్టు మర్చిపోయినట్లు గుర్తించిన రోహిత్.. వెంటనే తన సపోర్ట్ స్టాఫ్‌కు చెప్పడంతో వారు వెళ్లి మళ్లీ తీసుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…