Rohit Sharma : నా వ‌ల్ల కాదు, వాళ్లిద్ద‌రి వ‌ల్లే మ్యాచ్ గెలిచామంటూ రోహిత్ స్ట‌న్నింగ్ కామెంట్స్

Rohit Sharma : వన్డే ప్రపంచకప్ 2023 లో టీమిండియా దుమ్ము రేపుతుంది. ఆరు మ్యాచ్‌లు ఆడ‌గా, అన్నింట్లోను మంచి విజ‌యం సాధించింది. అటు బౌలింగ్ లో, బ్యాటింగ్ లో సత్తా చాటుతూ ప్రత్యర్థులను చిత్తూ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్ ల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించి.. పాయింట్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. నిన్న ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 229 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 129 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాకూండా.. సెమీస్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.

ఇక విషయానికి వస్తే.. నిన్న జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 230 స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆది నుండే అడ్డంకులు ఏర్పడ్డాయి. బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ను దెబ్బ తీయ‌గా, ఆయన‌కి తోడుగా ష‌మీ కూడా అద్భుతం చేశాడు. కీల‌క‌మైన నాలుగు వికెట్స్ ప‌డ‌గొట్టి ఇండియా విజ‌యంలో ముఖ్య పాత్ర పోషించాడు.. ఇంగ్లాండ్ జట్టును 130 కట్టడి చేసే క్రమంలో ఒకానొక సందర్భంలో కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నారు. వరుసగా వికెట్లు పడే క్రమాంలో పలు సార్లు సంబరాలు చేసుకోగా.. మోయిన్ అలీ వికెట్ పడిన సందర్భంలో కోహ్లీ.. రోహిత్ శర్మను గట్టిగా హత్తుకొని పైకెత్తిన ఘటన మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.

Rohit Sharma interesting comments on team india
Rohit Sharma

అయితే గెలుపు త‌ర్వాత రోహిత్ మాట్లాడుతూ.. బుమ్రా, ష‌మీ అద్భుతంగా గెలిచారు. వారిద్ద‌రి వ‌ల్ల‌నే మ్యాచ్ గెలిచాం. బ్యాటింగ్ బాగోలేక‌పోయిన బౌలింగ్ అద్భుతంగా చేసి అద‌ర‌హో అనిపించారు అని రోహిత్ అన్నారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది రోహిత్ సేన. 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ మరోసారి కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 87 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్-49, కేఎల్ రాహుల్- 39 పరుగులు చేశారు. ఇంగ్లండ్ 129 పరుగులకే కుప్పకూల్చింది. మహ్మద్ షమీ- 4, జస్‌ప్రీత్ బుమ్రా- 3 వికెట్లతో నిప్పులు చెరిగారు. కుల్‌దీప్ యాదవ్-2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago