Gachibowli Stadium : సీఎం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి ఎంతగా సంఘీభావం తెలియజేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతగా గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో “ సిబిఎన్ గ్రాటిట్యుడ్ సభను ” ఏర్పాటు చేశారు. శని,ఆదివారాలు కావడంతో పెద్ద ఎత్తున ఐటి ఉద్యోగులు,టీడీపీ అభిమానాలు ఈ కన్సర్ట్ లో పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.ఇక ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ప్రారంభంలో చంద్రబాబుపై స్పెషల్ వీడియో ప్రదర్శించారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనూప్ రూబెన్స్ టీమ్ ఆధ్వర్యంలో సంగీత విభావరి కూడా జరిగింది. సైబర్ టవర్స్ నిర్మాణం, ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక వీడియో విడుదల చేశారు. చంద్రబాబు అభిమానులతో గచ్చిబౌలి మైదానం నిండిపోయింది. సెల్‌ఫోన్ల లైటింగ్‌తో చంద్రబాబుకు ఐటీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. చంద్రబాబు ముందు చూపు వల్లే ఐటీ టవర్స్ ఇంతగా అభివృద్ధి చెందాయని తెలిపారు.బాలయ్య సతీమణి, కూతుళ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి తమ నిరసన తెలియజేశారు.
ఇక ఈ కార్యక్రమంలో సినీ, హాజరయ్యారు. బోయపాటి శ్రీను, బండ్ల గణేష్, నందమూరి కుటుంబ సభ్యులకు పాటు ఐటీ ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబును జైల్లో పెట్టడానికి గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రసంగం మధ్యలో చంద్రబాబు అరెస్టును గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. యువతకు భవిష్యత్తును ఇచ్చినందుకు జైల్లో పెడతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం చచ్చిపోతానంటూ, తన ఆయుష్షును చంద్రబాబుకు ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నానని చెప్పారు. చంద్రబాబు దేవుడని తెలుగువారిగా పుట్టడం నేరమా? అని ప్రశ్నించారు. తమిళనాడులో చంద్రబాబు పుట్టుంటే ఇలా జరిగేదా? పని బండ్ల గణేష్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు కాదని, అది ఒక బ్రాండ్ అని ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు నిజాయితీపరుడని ఆయన ఏ తప్పు చేయలేదని వెల్లడించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…