Rohit Sharma : వన్డే ప్రపంచకప్ 2023 లో టీమిండియా దుమ్ము రేపుతుంది. ఆరు మ్యాచ్‌లు ఆడగా, అన్నింట్లోను మంచి విజయం సాధించింది. అటు బౌలింగ్ లో, బ్యాటింగ్ లో సత్తా చాటుతూ ప్రత్యర్థులను చిత్తూ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్ ల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించి.. పాయింట్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. నిన్న ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 229 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 129 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాకూండా.. సెమీస్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.
ఇక విషయానికి వస్తే.. నిన్న జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 230 స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆది నుండే అడ్డంకులు ఏర్పడ్డాయి. బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ను దెబ్బ తీయగా, ఆయనకి తోడుగా షమీ కూడా అద్భుతం చేశాడు. కీలకమైన నాలుగు వికెట్స్ పడగొట్టి ఇండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.. ఇంగ్లాండ్ జట్టును 130 కట్టడి చేసే క్రమంలో ఒకానొక సందర్భంలో కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నారు. వరుసగా వికెట్లు పడే క్రమాంలో పలు సార్లు సంబరాలు చేసుకోగా.. మోయిన్ అలీ వికెట్ పడిన సందర్భంలో కోహ్లీ.. రోహిత్ శర్మను గట్టిగా హత్తుకొని పైకెత్తిన ఘటన మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.
అయితే గెలుపు తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. బుమ్రా, షమీ అద్భుతంగా గెలిచారు. వారిద్దరి వల్లనే మ్యాచ్ గెలిచాం. బ్యాటింగ్ బాగోలేకపోయిన బౌలింగ్ అద్భుతంగా చేసి అదరహో అనిపించారు అని రోహిత్ అన్నారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది రోహిత్ సేన. 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ మరోసారి కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 87 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్-49, కేఎల్ రాహుల్- 39 పరుగులు చేశారు. ఇంగ్లండ్ 129 పరుగులకే కుప్పకూల్చింది. మహ్మద్ షమీ- 4, జస్‌ప్రీత్ బుమ్రా- 3 వికెట్లతో నిప్పులు చెరిగారు. కుల్‌దీప్ యాదవ్-2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.