Rohit Sharma : శాంస‌న్‌ని అందుకే ప‌క్క‌న పెట్టాము.. కోపంలోనే గిల్‌పై అరిచానన్న రోహిత్..

Rohit Sharma : చాలా ఏళ్ల త‌ర్వాత రోహిత్ శ‌ర్మ టీ20ల‌లోకి తిరిగి వ‌చ్చాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం వెనుక ప్రత్యేకమైన కారణం ఏం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ చూడటానికి బాగుందని చెప్పిన రోహిత్.. పెద్దగా మారే అవకాశం లేదన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో భార‌త్ మంచి విజ‌యం సాధించింది. దూబే అద్భుత‌మైన బ్యాటింగ్‌తో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో భార‌త్ ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చోటు చేసుకున్నాయి. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్‌లను పక్కనపెట్టిన‌ట్టు మ్యాచ్ కి ముందు రోహిత్ చెప్పాడు.

టీ20 ప్రపంచకప్ 2024 ముందు మేం ఆడుతున్న ఏకైక టీ20 సిరీస్ ఇదే.మెగా టోర్నీ ముందు ఐపీఎల్ మాత్రమే ఆడనున్నాం. ఈ మూడు మ్యాచ్‌లను మా టీమ్ కాంబినేషన్‌ ఎంపికకు వాడుకుంటాం. కాంబినేషన్ గురించి ఇప్పటికే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చర్చించాను. జట్టుకు కావాల్సిన కాంబినేషన్‌ను ఎంపిక చేసేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకుంటాం. అలాగే ఈ సిరీస్ గెలవడం కూడా మాకు ముఖ్యమే.టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం ఇవ్వలేదు.’అని రోహిత్ శర్మ తెలిపాడు.

Rohit Sharma interesting comments on shubman gill
Rohit Sharma

ఇక టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే రోహిత్ శర్మ (0) రనౌటయ్యాడు. అనంతరం మైదానాన్ని వీడుతూ గిల్‌పై రోహిత్ నోరు పారేసుకున్నాడు.మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి రోహిత్ స్పందిస్తూ.. అసహనంతో కోపంగా మాట్లాడని తెలిపాడు. ఉద్దేశపూర్వకంగా అనలేదని వివరణ ఇచ్చాడు. మరోవైపు కామెంటేటర్స్ ఈ విషయంలో రోహిత్‌దే తప్పు అని పేర్కొన్నారు. ”గిల్ బంతి వైపు చూస్తున్నాడు. మరోవైపు రోహిత్ పరుగు కోసం ఒకేసారి పిలిచాడు. మరోసారి హెచ్చరించలేదు. ఇది సరైనది కాదు. ఈలోపు రోహిత్ పరుగు దాదాపు పూర్తిచేశాడుస‌స‌. అయితే వికెట్ మధ్యలో పరుగు కోసం ప్రయత్నించేటప్పుడు రెండు కీలక విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి పరుగును మొదలుపెట్టడం, మరొకటి మన భాగస్వామి వేగాన్ని అంచనా వేయడం. అంతేకానీ మనం ఎంత బాగా పరిగెత్తుతున్నామనేది ఇక్కడ కీలకం కాదు. మన పార్టనర్ పరుగు కావాలనుకుంటున్నాడా, వేగంగ ఉన్నాడనేది ముఖ్యం” అని కామెంటేటర్స్ అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago