Former Governor Narasimhan : కేసీఆర్‌ని ప‌రామ‌ర్శించిన పాత గ‌వ‌ర్న‌ర్.. ఆయ‌న‌ని చూడ‌గానే ముఖంలో పాత క‌ళ‌..

Former Governor Narasimhan : ఇటీవల తుంటికి ఆపరేషన్‌ జరిగి కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను గ‌త కొద్ది రోజులుగా ప‌లువురు ప‌రామ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా మాజీ గవర్నర్‌ నరసింహన్‌ పరామర్శించారు. నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి చేరుకున్న నరసింహన్‌ దంపతులను మాజీ మంత్రి కేటీఆర్‌ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న నరసింహన్‌.. త్వరలో పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.

తెలంగాణ అభివృద్ధిలో నరసింహన్‌ అందించిన సహకారం, రాష్ట్ర ఏర్పాటు, అనంతర పరిణామాలు, ఇతర అంశాలపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. నరసింహన్‌ దంపతులకు కేసీఆర్‌, ఆయన సతీమణి శోభమ్మ పట్టు వస్త్రాలిచ్చి సంప్రదాయ పద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. క్రమంగా కోలుకుంటున్న కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఆరోగ్యవంతులు కావాలంటూ ఆకాంక్షించారు. కాగా, కేసీఆర్ నివాసానికి వచ్చిన నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు.. కార్యక్రమంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, కొప్పులఈశ్వర్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, బీబీ పాటిల్‌ పాల్గొన్నారు.

Former Governor Narasimhan met ex cm kcr
Former Governor Narasimhan

అంతకుముందు నందినగర్ నివాసానికి చేరుకున్న నరసింహన్, విమల దంపతులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (KTR) పుష్పగుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. దగ్గరుండి వారిని లిఫ్టులో పైఅంతస్తుకు తీసుకెళ్లారు.నాడు కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ఈ సందర్భంగా కేసీఆర్, నరసింహన్ మధ్య చర్చకు వచ్చింది. ఈ క్రమంలో గవర్నర్ హోదాలో నాడు నరసింహన్ అందించిన సంపూర్ణ సహకారానికి కేసీఆర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.ఇక ఇదిలా ఉంటే కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే డేంజ‌ర్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాక సమావేశం సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు కేటీఆర్. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజలకు మధ్యకు వస్తారని చెప్పారు. సీఎం అనే రెండక్షరాల కంటే కేసీఆర్‌ అనే మూడు అక్షరాలు చాలా పవర్‌ఫుల్ అన్నారు. ఖమ్మం వంటి ఒకటి, రెండు జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలే సాధించిందన్నారు. ఖమ్మంలో నేతల మధ్య ఆధిపత్య పోరే ఓటమికి కారణమన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago