Rohit Sharma : చాలా ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ టీ20లలోకి తిరిగి వచ్చాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం వెనుక ప్రత్యేకమైన కారణం ఏం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ చూడటానికి బాగుందని చెప్పిన రోహిత్.. పెద్దగా మారే అవకాశం లేదన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ మంచి విజయం సాధించింది. దూబే అద్భుతమైన బ్యాటింగ్‌తో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో భారత్ ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్‌లను పక్కనపెట్టినట్టు మ్యాచ్ కి ముందు రోహిత్ చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ 2024 ముందు మేం ఆడుతున్న ఏకైక టీ20 సిరీస్ ఇదే.మెగా టోర్నీ ముందు ఐపీఎల్ మాత్రమే ఆడనున్నాం. ఈ మూడు మ్యాచ్‌లను మా టీమ్ కాంబినేషన్ ఎంపికకు వాడుకుంటాం. కాంబినేషన్ గురించి ఇప్పటికే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చర్చించాను. జట్టుకు కావాల్సిన కాంబినేషన్‌ను ఎంపిక చేసేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకుంటాం. అలాగే ఈ సిరీస్ గెలవడం కూడా మాకు ముఖ్యమే.టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం ఇవ్వలేదు.’అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఇక టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే రోహిత్ శర్మ (0) రనౌటయ్యాడు. అనంతరం మైదానాన్ని వీడుతూ గిల్‌పై రోహిత్ నోరు పారేసుకున్నాడు.మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి రోహిత్ స్పందిస్తూ.. అసహనంతో కోపంగా మాట్లాడని తెలిపాడు. ఉద్దేశపూర్వకంగా అనలేదని వివరణ ఇచ్చాడు. మరోవైపు కామెంటేటర్స్ ఈ విషయంలో రోహిత్‌దే తప్పు అని పేర్కొన్నారు. ”గిల్ బంతి వైపు చూస్తున్నాడు. మరోవైపు రోహిత్ పరుగు కోసం ఒకేసారి పిలిచాడు. మరోసారి హెచ్చరించలేదు. ఇది సరైనది కాదు. ఈలోపు రోహిత్ పరుగు దాదాపు పూర్తిచేశాడుసస. అయితే వికెట్ మధ్యలో పరుగు కోసం ప్రయత్నించేటప్పుడు రెండు కీలక విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి పరుగును మొదలుపెట్టడం, మరొకటి మన భాగస్వామి వేగాన్ని అంచనా వేయడం. అంతేకానీ మనం ఎంత బాగా పరిగెత్తుతున్నామనేది ఇక్కడ కీలకం కాదు. మన పార్టనర్ పరుగు కావాలనుకుంటున్నాడా, వేగంగ ఉన్నాడనేది ముఖ్యం” అని కామెంటేటర్స్ అన్నారు.