Rohit Sharma : ప్రపంచకప్ ఆఖరి మెట్టుపై టీమిండియా బొక్కబోర్లా పడింది. అప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి చెందని భారత్ ఫైనల్ లో ఆసీస్‌పై దారుణంగా ఓడింది. టోర్నీలో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి.. ఆ తర్వాత వరుస విజయాలు సాధించి.. సెమీస్ లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి.. తుది సమరంలో టీమిండియాను కంగుతినిపించి ఆరోసారి ట్రోఫీ దక్కించుకుంది ఆసీస్ జట్టు. 241 పరుగుల సాధారణ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో.. ఆరు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (120 బంతుల్లో 137 పరుగులు; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో హీరోగా నిలిచాడు. అతనికి మార్నస్ లబుషేన్ (110 బంతుల్లో 58 పరుగులు నాటౌట్; 4 ఫోర్లు) సహకరించాడు.
ఆఖరి మెట్టుపై బోల్తా పడటం ఫ్యాన్స్ కు ఏడుపు తెప్పించింది. టీమిండియా ఆటగాళ్లు కూడా దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. మ్యాచ్ పూర్తయిన వెంటనే మహమ్మద్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. రోహిత్ శర్మ సైతం తలదాచుకుంటూ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాడు. ఇతర ఆటగాళ్లు కూడా కెమెరాలకు తమ ముఖాలను చూపించుకోలేకపోయారు. ఇక, రోహిత్ భార్య రితికా కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. కప్ కొడతారని అందరు భావించిన సమయంలో ఇండియా అలా ఓడిపోవడం ఎవరికి మింగుడుపడలేదు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురై ఓటమిని ఒప్పుకున్నాడు. తాము సరిగ్గా ఆడలేకపోయామని, బ్యాటింగ్‌లో మరో 20, 30 పరుగులు చేయాల్సిందని చెప్పుకొచ్చాడు. ట్రావిస్ హెడ్, లబుషేన్‌ల భాగస్వామ్యమే తమకు మ్యాచ్‌ను దూరం చేసిందని అన్నాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా గెలుపు క్రెడిట్ వారికే ఇచ్చాడు. నిజానికి రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనూకూలించిందని, కానీ తాము దానిని సాకుగా చెప్పాలనుకోవడం లేదని రోహిత్ శర్మ. ఇక్కడ ప్లడ్ లైట్ల కింద బ్యాటింగ్ చేయడం ఏ జట్టుకైనా అనుకూలిస్తుందని మాకు ముందే తెలుసు. మేము ముందుగా తగినన్నీ పరుగులు చేయలేదు. మా పేసర్లు ఆరంభంలోనే 3 వికెట్లు తీశారు. కానీ ఆ తర్వాత దానిని కొనసాగించలేకపోయాం. మధ్యలో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వారిద్దరికే క్రెడిట్ దక్కుతుంది.’’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…