Pawan Kalyan : ఏపీలో రాజకీయాలు రోజురోజుకి చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. అధికారం దక్కించుకునే క్రమంలో ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్.. వైసీపీ నాయకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. అడ్డగోలు దారులలో వచ్చి, దోపిడీలు, దొమ్మిడీలు చేసేవాడు మన ప్రజా ప్రతినిధులు అంటే అసలు సహించేది లేదు. వాళ్లకు మనం గులాం గిరి చేస్తూ బ్రతకలా. చిన్నప్పటి నుండి ఇది నా మనసులో బలంగా ఉండేది. నేనెప్పుడు డబ్బుకు ఆశపడలేదు. ఎంతో అభిమానం ఉన్నా కూడా దానిని నా కోసం వాడుకోలేదు. దేశ నిర్మాణం కోసం మాత్రమే వాటిని వాడతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.
‘జగనన్న విద్యా కానుక పేరిట నాసిరకం బ్యాగులు, బూట్లు విద్యార్థులకు ఇచ్చి కోట్లు కొల్లగొట్టడానికి దారులు వెతికిన ప్రభుత్వ పెద్దలకు.. ఉన్నతాశయంతో ఏర్పాటైన ఈ కళాశాలకు రూ.2 కోట్లు ఇచ్చేందుకు దారులు కనపడలేదంటే ఆశ్చర్యమే.ఈ ప్రభుత్వ విద్యా విధానం చూస్తుంటే “ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట!” అన్న సామెత గుర్తుకు వస్తోంది. ఉగ్గు పాలతోనే పిల్లలందరికి ఇంగ్లీష్ నేర్పుతామంటున్నజగన్ సర్కారు .. ఉన్నతమైన ఆశయంతో ఏర్పాటైన మచిలీపట్నం కళాశాలను ఎందుకు రక్షించడం లేదో అర్థం కావడం లేదు అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు… ఈ కళాశాల పునర్ వైభవానికి కృషి చేయకపోతే ఎన్నికల అనంతరం జనసేన పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుంది’’ అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
మరోవైపు పీపీలో అధ్వానంగా ఉన్న రోడ్లపై తెలుగుదేశం – జనసేన పార్టీలు రెండు కలిసి ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ పేరుతో 18, 19 వ తేదీల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఓ కార్టూన్‌ను పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. బస్సు, ఇతర వాహనదారులు గుంతల్లో పడి పైకి ఎగురుతున్నట్లుగా వ్యంగ్యంగా ఈ చిత్రం ఉంది. జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలారా గుంతల రోడ్లతో ఎన్నాళ్లు మనకు ఈ పాట్లు అని ఎక్స్‌లో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…