Nani : ఇటీవలి కాలంలో సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జనాలలోకి తమ సినిమాలని తీసుకెళ్లేందుకు మేకర్స్ వెరైటీ ప్లాన్స్ వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈ నెలాఖరున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నాని తన సినిమా ప్రమోషన్స్‌ని ఎన్నికల ప్రచారం స్టైల్ లో చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. పనిలో పనిగా తాను కొందరిపై ఇన్‌డైరెక్ట్ పంచ్‌లు కూడా వేశాడు.
నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి నాని జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకుడి గెటప్‌లోకి మారిపోయి ప్రచారం మొదలుపెట్టాడు. హాయ్ నాన్న పార్టీ మ్యానిఫెస్టో అంటూ ఓ ఫన్నీ వీడియోని షేర్ చేసారు. అందులో ”మన పార్టీని అధికారంలోకి తీసుకొస్తే యూత్ అంతా విచ్చలవిడిగా రీల్స్ చేసుకోడానికి స్మార్ట్ ఫోన్లను కిట్ కిట్ లుగా పంచిపెడతాం.
అందరి ఆదాయం పెరిగేలా చూస్తాం. థియేటర్ల ఆదాయం.. ఆ పక్కనే ఉన్న కిరాణా కొట్టోళ్ళ ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం” అని చెప్పాడు. ‘అప్పుడు సబ్జెక్ట్ టాపిక్ తెలియకుండా అదే పట్టుకొని ఇష్టమొచ్చినట్లు వాగేవాళ్ళ ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం’ అంటూ పనిలో పనిగా తన కిరాణా కొట్టు కాంట్రవర్సీపై సెటైర్ వేశారు. డెల్లాస్, టెక్సాస్ లలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నిర్మిస్తామని, అక్కడే సంధ్య దేవి సుదర్శన్ థియేటర్లు కట్టిస్తామని నవ్వులు పూయించారు. తమ పార్టీకే ఓటు వెయ్యండి అని పొలిటీషియన్స్ ఇలాంటి కబుర్లు ఎన్నో చెప్తారని, తమ సినిమానే చూడాలని యాక్టర్స్ కూడా ఎన్నెన్నో చెప్తారని, అలోచించి మంచోడికే ఓటు వెయ్యాలని, మంచి సినిమానే థియేటర్లలో చూడాలని సూచించారు. అలానే ఇటీవల మీడియా మిత్రులను ఉద్దేశిస్తూ యాంకర్ సుమ చేసిన కామెంట్స్ పై వివాదం చెలరేగడంపైనా నాని సెటైర్లు వేశారు. సారీ చెప్పాడని తాను యాంకర్ ను కాదని, పొలిటిషియన్ అంటూ నాని ముగించారు. మొత్తానికి నాని కొందరిని ఎత్తుతూ మరి కొందరిపై సెటైర్స్ వేయడం హాట్ టాపిక్ అయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…