Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బద్రి’ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది . తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తరుచుగా సమాచారాన్ని అందిస్తూ వస్తుంటుంది రేణూ. ఆ మధ్య తన అనారోగ్య సమస్యపై రేణూ దేశాయ్ పోస్ట్ పెట్టింది. త్వరలోనే కోలుకొని సాధారణ స్థితికి వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా గుండె సంబంధ సమస్య, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది.
ఇక రీసెంట్‌గా అకీరా పుట్టిన రోజు సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేసింది రేణూ . ఆ ఫోటో లో అఖీరా నందన్ ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. కాగా ఆ ఫోటోకు పవన్ అభిమాని ఒకరు మా అన్న కొడుకుని సరిగ్గా చూపించండి మేడమ్, మా అందరికి మా అన్న కొడుకును చూడాలని ఆశగా ఉండదా అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ పై రేణూ దేశాయ్ ఫైర్ అయ్యింది. మీ అన్న కొడుకా అకీరా నా కొడుకు..ముందు పద్దతిగా మాట్లాడటం నేర్చుకోండి. మీరు వీరాభిమానులు కావచ్చు కానీ పద్దతి గా ఉండటం నేర్చుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అలా పవన్ అభిమానులు, రేణూ దేశాయ్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో పవన్ అభిమానులు రేణు దేశాయ్ కి ఓ సలహా ఇచ్చారు. పవన్ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి యాంటీ ఫ్యాన్స్ పవన్ అభిమానుల మాదిరి మీకు తప్పుడు సందేశాలు పంపిస్తున్నారేమో.. అందుకు మీరు ఇంస్టాగ్రామ్ అకౌంట్ సెట్టింగ్స్ అయిన మార్చుకోండి లేదంటే కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేయమని సలహా ఇచ్చారు. దీంతో రేణూ.. సమాజంతో ఇదే ప్రాబ్లమ్. ఎవరి కోసమో నేను మారాలా? మీరు చెప్పినట్లు జీవించడానికి నేను ఏమి తప్పు చేశాను సలహా ఇవ్వడం చాలా ఈజీ. బాధ అనుభవించే వాళ్లకు తెలుస్తుంది.. అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది రేణూ.. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…