Chiranjeevi : చిరంజీవి గ్యారేజ్‌లో చేరిన మ‌రో ల‌గ్జరీ కారు.. దీని ప్ర‌త్యేక‌త‌లు తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి యువ హీరోల మాదిరి కొత్త కార్ల‌పై ఆస‌క్తి చూపిస్తూ ఉంటారు. సాధార‌ణంగా యువ హీరోలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే అధునాతనమైన సూపర్ లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం మ‌నం గ‌మ‌నిస్తూ ఉంటాం.ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరికి గ్యారేజ్ లో ఎంతో ఖరీదైన కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఉంటాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గ్యారేజ్ లోకి మరొక సూపర్ లగ్జరీ కారు వచ్చి చేరింది.ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరొక కారును కొనుగోలు చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అత్యాధునిక లగ్జరీ వాహనం టొయోటా వెల్‌ఫైర్ కాగా, షోరూం ధర, లైఫ్‌ ట్యాక్సీ ధరలు కలుపుకుని మొత్తం సుమారు 1.9కోట్ల రూపాయల విలువ ఉంటుంది. బర్నింగ్‌ బ్లాక్‌తో కనులవిందుగా దర్శనమిస్తున్న ఈ వాహనానికి ఆర్టీఏ అధికారులు ఆల్‌-1 నంబర్‌ కేటాయించారు. రూ.4.70లక్షలతో టీఎస్‌09 జీబీ1111 నంబర్‌ను మెగాస్టార్‌ కైవసం చేసుకోవ‌డం విశేషం. ఇక రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్‌సీ)కోసం మంగళవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి మెగాస్టార్‌ వచ్చారు. ఆర్టీఓ రామచంద్రం సమక్షంలో ఫొటో, డిజిటల్‌ సంతకం తదితర ప్రక్రియ పూర్తి చేశారు.

Chiranjeevi bought another luxury car
Chiranjeevi

కొణిదెల చిరంజీవి పేరుతో వాహనం రిజిస్ట్రేషన్ కాగా, ఇండియన్‌ ఫోర్‌ వీలర్‌ మార్కెట్లో బుకింగ్స్‌కు వేచి చూడాల్సిన వాహనం టొయోటా వెల్‌ఫైర్‌ కావడం విశేషం. ఇందులో ప్ర‌త్యేక‌త‌లు అద‌ర‌హా అనిపించేలా ఉంటాయి. ఏడుగురు దర్జాగా కూర్చొని జర్నీ చేయొచ్చు. మధ్య వరుసలో వీఐపీ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. భద్రత కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉంటాయి.. ట్విన్‌ సన్‌రూఫ్‌, త్రీజోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 13 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్స్ ఇందులో ప్ర‌త్యేక‌త‌లు. ఫ్రంట్‌లో కూడా పది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ కూడా ఉంది. ఈ వాహనం బర్నింగ్‌ బ్లాక్‌, వెల్‌ఫైర్‌ పెరల్‌ వైట్‌, గ్రాఫైట్‌ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనం మైలేజీ గరిష్ఠంగా లీటర్‌కు సుమారు 16.35 కిలో మీటర్లు. దీనికి 2.5 పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లు కూడా ఉన్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago