Raghava Lawrence : కొందరు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరోలని నిరూపించుకుంటున్నారు. వారిలో కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు కమ్ నటుడు లారెన్స్ తప్పక ఉంటారు. ఆయన కేవలం సినిమాల్లో నటించడమే కాదు, మంచి పనులు కూడా చేస్తుంటాడు. తను స్థాపించిన ట్రస్ట్ ద్వారా పిల్లల్ని చదివించడం, వైద్యం చేయించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు.. అయితే వీటిని తను గొప్పగా ఫీల్ అవ్వనని అంటున్నాడు లారెన్స్. ఈ విషయంలో తను కేవలం దేవుడికి పనిమనిషిని మాత్రమే అని చెబుతున్నాడు. ఇప్పటికే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు తన వంతు సాయం చేయగా, తాజాగా ఆయన మరో 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు.
ఈ విషయాన్ని లారెన్స్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. నాణ్యమైన ఈ పిల్లలని చక్కగా చదివించి.. ప్రయోజకులను చేస్తామని చెప్పారు. అంతే కాదు తనకు అభిమానుల ఆశీస్సులు.. ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పటికీ కావాన్నారు రాఘవ లారెన్స్ . రుద్రన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా ఆ చిన్నారులతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నేను ఓ హీరోగా కంటే ఓ మనిషిగా బాగుండాలని అంతా కోరుకుంటున్నారు కాబట్టి నేను కూడా అలానే ఉంటాను.
నా వల్ల ఎంత వీలైతే అంత సేవ చేస్తాను. ఓపెన్ హార్ట్ సర్జరీలు, చదువుకు సాయం లాంటివి ఇంకా ఎన్నోచేస్తాను. స్టార్టింగ్ లో ఇవన్నీ నేనే చేస్తున్నానని అనుకునేవాడ్ని. ఇవన్నీ దేవుడు చేస్తున్నాడని వయసు పెరిగేకొద్దీ నాకు అర్థమైంది. నన్ను ఓ పనిమనిషిగా పెట్టుకొని దేవుడు ఇవన్నీ నాతో చేయిస్తున్నాడు. నేను కేవలం పనిమనిషిని మాత్రమే. నన్ను ఎంపిక చేసుకున్న ఆ రాఘవేంద్రస్వామికి థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ కామెంట్ చేశాడు లారెన్స్. ఎన్నో సేవా కార్యక్రమాలతో అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు లారెన్స్. ప్రస్తుతం చంద్రముఖి సినిమాకుసీక్వెల్ చేస్తున్నారు. ఈలోపు ఆయన నటించిన రుద్రుడు సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…