Renu Desai : పిల్ల‌ల‌ని పాలిటిక్స్‌లోకి తేవొద్దు.. నా స‌పోర్ట్ నా మాజీ భ‌ర్తకి త‌ప్ప‌క ఉంటుంద‌న్న రేణూ..

Renu Desai : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు ఎంత వాడివేడిగా సాగుతున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకుపోతున్నాయి. ఈ తరుణంలో వ్యక్తిగత విమర్శలు కూడా దారుణంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విష‌యంతో ఆయ‌న‌ని మ‌రింత డౌన్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. ప‌వన్ క‌ళ్యాణ్ బ్రో సినిమాలో అంబ‌టిపై సెటైర్ వేయ‌గా, ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెళ్లిళ్ల గురించి వెబ్ సిరీస్ తీస్తానంటూ ప్ర‌క‌టించాడు. ఈ క్ర‌మంలో రేణూ దేశాయ్ ఓ వీడియో విడుద‌ల చేసింది.

రాజకీయాల్లోకి తనను, తన పిల్లలను లాగొద్దని విజ్ఞప్తి చేసింది. తన మాజీ భర్త, తనకు సంబంధించిన అంశాలతో సినిమా, ఓటీటీ సీరిస్‌లు తీస్తామంటున్నారని.. అది కరెక్ట్ కాదంటూ సూచించారు. రాజకీయాల్లో విమర్శలు సహజం.. కానీ పిల్లలను, మహిళలను లాగకండి అంటూ పేర్కొన్నారు. తన పిల్లలే కాదు, ఏ రాజకీయ నాయకుడి పిల్లలను లాగడం మంచిది కాదంటూ సూచించారు. మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు.. పవన్‌ కల్యాణ్‌ డబ్బు మనిషి కాదు.. నా వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీసుకురావొద్దంటూ సూచించారు. అంతటితో ఆగకుండా రేణు దేశాయ్‌ పవన్‌ కల్యాణ్ పై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Renu Desai comments on pawan kalyan
Renu Desai

నా విష‌యంలో మాజీ భర్త (పవన్‌) చేసింది ముమ్మాటికి తప్పేనని.. కానీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకురావొద్దని రేణుదేశాయ్‌ సూచించారు. పవన్ కల్యాణ్ ఆశయాలు గొప్పవి.. పవన్ డబ్బు మనిషి కాదు.. పవన్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజల కోసం పవన్ పనిచేయాలన్న తపన గొప్పది.. అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. అయితే రేణూ వీడియో విడుద‌ల చేసిన వెంట‌నే అంబ‌టి .. ‘అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!’ అని ట్వీట్ చేశారు. మంత్రి బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్‌ను ప్రస్తావించారు. తమలాంటి క్యారెక్టర్లను సినిమాల్లో పెట్టి శునకానందం పెట్టొద్దని పవన్ కళ్యాణ్‌కు చెప్పాలంటూ రేణూను రిక్వెస్ట్ చేస్తూ మంత్రి అంబటి రాంబాబు ఒకింత సెటైర్లు పేల్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago