Roja : అమ్మ రేణూ దేశాయ్.. గంట‌కో మాట మారుస్తున్నావేంటంటూ రోజా పంచ్..

Roja : ఏపీలో అధికార ప‌క్షం, ప్ర‌తిప‌క్షాలు ఒకరిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ప‌ర్స‌న‌ల్‌గా టార్గెట్ చేస్తూ ఆయ‌న పెళ్లిళ్ల‌పై వెబ్ సిరీస్‌లు తీస్తాన‌ని అంబ‌టి రాంబాబు ప్ర‌క‌టించ‌డంతో రేణూ దేశాయ్ ఓ వీడియో విడుద‌ల చేశారు. అందులో పిల్ల‌ల‌ని రాజకీయాల‌లోకి లాగొద్దని కోరారు. అంతేకాదు త‌న స‌పోర్ట్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఉంటుంద‌ని, ఈ ఒక్క‌సారి ప‌వ‌న్‌కి అవ‌కాశం ఇవ్వండ‌ని రేణూ కోరింది. దీనిపై రోజా తాజాగా స్పందించింది. ఓ సారి ఏబీన్ ఛానెల్‌లో మ‌ట్లాడుతూ.. నాతో సంసారం చేస్తూ వేరే ఎవ‌రికో కడుపు చేశాడ‌ని ఆమె చెప్పుకొచ్చింది. మ‌రి ఆమె ఇప్పుడు ఇలా మాట ఎందుకు మార్చిందో తెలియదు. ఆమెతో ఎవరు ఇలా చెప్పించారో ఆమెకే తెలియాలి అని రోజా పేర్కొంది.

ఉత్త పుత్రుడు, దత్త పుత్రుడిని చెరో వైపు పెట్టుకొని ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. పవన్ ఆటలో అరిటి పండు అంటూ కించపరిచేలా మాట్లాడారు. అమిత్ షా తో చెప్పి జగన్ సంగతి చూస్తా అన్న పవన్ వ్యాఖ్యలపై స్పందించిన రోజా.. సోనియా గాంధీ నే ఎదిరించిన ధీరుడు జగన్ అని.. ఆయన వెంట్రుక కూడా పవన్ పీక లేరన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే సింగిల్‌గా పోటీ చేయాలని మంత్రి రోజా సవాల్ చేశారు. విశాఖ‌లో రుషికొండ‌ను త‌వ్వేస్తున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించిన నేప‌థ్యంలో రోజా కౌంట‌ర్ ఇచ్చారు. వైజాగ్‌ను ప‌రిపాలన రాజ‌ధానిగా ప్ర‌క‌టించి, దాన్ని అంత‌ర్జాతీయ న‌గ‌రంగా అభివృద్ధి చేయాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళుతున్నార‌న్నారు.

Roja powerful comments on renu desai
Roja

చంద్ర‌బాబు ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ ..ప‌వ‌ర్ స్టార్ కాదు, రీమేక్ స్టార్ అన్న‌ట్టుగా విశాఖ వెళ్లి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా అదే హ‌డావుడి చేస్తున్నాడ‌ని రోజా త‌ప్పు ప‌ట్టారు. రుషికొండ‌ను బోడిగుండు చేసేశారని బోడి వెధ‌వ‌లంతా బోడి ప్ర‌చారం చేయ‌డం ఒక ప్యాష‌న్ అయ్యింద‌ని మండిప‌డ్డారు. రుషికొండ వ‌ద్ద ప‌వ‌న్ కారెక్కి గోడ ఎక్కి దూకి హ‌డావుడి చేశార‌ని ఆమె అన్నారు. రుషికొండ‌లో ఏం లోపాలు జ‌రుగుతున్నాయ్‌? ఎలాంటి అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ్‌? నువ్వేం క‌నిపెట్టావో చెప్ప‌య్యా అంటే ఆయ‌న‌కు మాట‌లు లేవ‌ని రోజా అన్నారు. సుప్రీంకోర్టు కంటే గొప్పోడివా? అని ప‌వ‌న్‌ను రోజా నిల‌దీశారు. రుషికొండ‌పై ఏపీ హైకోర్టు విచారిస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వం చేసే ప్ర‌తి ప‌నికి సంబంధించిన వివ‌రాల్ని అఫిడ‌విట్ రూపంలో తెలియ‌జేస్తున్నామ‌న్నారు. రుషికొండ‌పై నిర్మాణాలు చేప‌డితే ప‌ర్యావ‌ర‌ణం ధ్వంస‌మ‌వుతుంద‌ని అనుకుంటే, మ‌రి రామానాయుడు స్టూడియో, ఐటీ ట‌వ‌ర్స్ నిర్మాణాల మాటేంట‌ని ఆమె నిల‌దీశారు. కొండ‌మీద క‌ట్ట‌డాలు నీ కంటికి క‌నిపించ‌లేదా? అని ఆమె నిల‌దీశారు. నీ క‌ళ్ల‌ను క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్‌లో తాక‌ట్టు పెట్టావా? అని రోజా ప్ర‌శ్నించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago