Sreeleela : శ్రీలీల ఎంత క‌ష్ట‌ప‌డుతుంది.. ఆమె ముందు డ్యాన్స్ మాస్ట‌ర్ తేలిపోవ‌డ‌మే..!

Sreeleela : ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు శ్రీలీల‌. ఏ హీరో సినిమా చూసిన ఈ అమ్మ‌డే క‌నిపిస్తుంది. ద‌ర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా పెళ్లి సందD సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తెరగేట్రం చేసిన శ్రీలీల.. రవితేజ ధమాకాలో న‌టించి మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాతో శ్రీలీల ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. స్టార్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి ఈ బ్యూటికి అవకాశాలు ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. అలా బాలకృష్ణ, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది శ్రీలీల. అంతేకాకుండా ఆమె చేతిలో ఇప్పటికే 7 భారీ చిత్రాలు ఉన్నాయి. శ్రీలీల నటిస్తున్న సినిమాల్లో ‘ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ ఒకటి.

నితిన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ తో నా పేరు సూర్య మూవీ తర్వాత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత హరీస్ జయరాజ్ తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో డేంజ‌ర్ పిల్ల కోసం శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో క‌లిసి శ్రీలీల చిందులు వేసింది. ఇందులో శ్రీలీల డ్యాన్స్ చూసి స్ట‌న్ అవుతున్నారు. శ్రీలీల డ్యాన్స్ ముందు కొరియోగ్రాఫ‌ర్ కూడా తేలిపోయాడుగా అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో శేఖర్ మాస్టర్ కన్నా శ్రీలీల బాగా చేసింది అని కామెంట్స్ పెడుతున్నారు. శ్రీలీల తన లెగ్స్ ను స్ప్రింగ్‌లా ఊపుతు మూమెంట్స్ చేసింది.

Sreeleela dance practice video viral
Sreeleela

ధ‌మాకా చిత్రంలో కూడా శ్రీలీల త‌న డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టింది. ముందు చాలా ప్రాక్టీస్ చేసిన శ్రీలీల చిత్రంలో త‌న పర్‌ఫార్మెన్స్ తో అద‌ర‌గొట్టింది. ప్రస్తుతం శ్రీలీల మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. అదేవిధంగా పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్, బాలయ్య భగవంత్ కేసరిలో ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. మరోవైపు రామ్ స్కందలోను వైష్ణవ్ తేజ్ ఆదికేశవలోనూ, నితిన్ తో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్. ఐతే రామ్, వైష్ణవ్ తేజ్‌, నితిన్ లు ముగ్గురి గత సినిమాలో ఫ్లాప్ కావడంతో తన కెరీర్ కి ఎఫెక్ట్ అవుతుందేమో అని టెన్షన్‌తో ఆందోళన చెందుతోందట శ్రీలీల.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago