Chiranjeevi : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి చెబుతూ ఫుల్ ఎమోష‌న‌ల్ అయిన చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా స‌త్తా చాటుతున్నాడు. ప‌వ‌న్ ఎదుగుద‌ల‌ని చూసి చిరంజీవి చాలా మురిసిపోతుంటారు.పవన్ కల్యాణ్ ఎప్పటికైన ఉన్నత స్థానంలో ఉంటారని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పవన్‌ పై కొందరు చేసే విమర్శలు తనను ఎంతో బాధిస్తాయని చిరంజీవి అన్నారు. తన తమ్ముడిపై కొందరు మితిమీరి విమర్శలు చేస్తున్నారని, అవి విన్నప్పుడు తట్టుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ పై కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారన్నారు. మెగాస్టార్ చిరు తాజా చిత్రం వాల్తేరు వీరయ్య ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా తమ్ముడిని విమర్శించిన వాళ్లు నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారు. పవన్ ను అన్ని మాటలు అన్నవారితో మళ్లీ మాట్లాడాల్సివస్తోందే, వాళ్లను కలవాల్సి వస్తోందే అనే బాధ నాకు ఉంటుంది అని చిరు అన్నారు. పవన్‌ నా బిడ్డలాంటి వాడు. మా కుటుంబం అంటే పవన్ కు ఎంతో ప్రేమ. డబ్బు, పదవులపై పవన్ కు వ్యామోహం లేదు. నిన్న మొన్నటిదాకా పవన్‌కు సొంత ఇల్లు కూడా లేదు. రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ కొంతమంది అతడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ మాటలు విన్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. పవన్‌ను విమర్శించిన వాళ్లతో నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Chiranjeevi emotional about pawan kalyan
Chiranjeevi

గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో నాగ‌బాబు క‌న్నా ప‌వ‌న్ అంటేనే ఎక్కువ‌గా చెబుతుంటారు అని చిరుకి ప్ర‌శ్న ఎదురు కాగా, క‌ళ్యాణ్ చాలా సైలెంట్‌. నా ద‌గ్గ‌ర ఎక్కువ పెరిగాడు. కుటుంబంలో చిన్న‌వాడుకావ‌డం వాడి చుట్టూ అంద‌రు పెద్ద‌వాళ్లు ఉండ‌డంతో సైలెంట్‌గా ఉంటాడు. నేను ఒక‌సారి విదేశాల‌కి వెళ్లి బొమ్మలు తీసుకొస్తే ఇప్ప‌టికి వాటిని చాలా జాగ్ర‌త్త‌గా పెట్టుకున్నాడు. వాళ్ల పిల్ల‌ల‌ని కూడా ట‌చ్ చేయోద్ద‌ని చెబుతుంటాడు. ఆ ర‌కంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాకు మ‌ధ్య ప్ర‌త్యేక బాండింగ్ ఉంటుంది. ఫాదర్, స‌న్ బాండింగ్ మా మ‌ధ్య నెల‌కొంది అని చిరు ఎమోష‌న‌ల్ అవుతూ చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago