Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వివాదాలకి దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయాలలో చర్చనీయాంశం అయింది. చిరు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మొత్తం విరుచుకుపడ్డారు. అయితే చిరంజీవి ఈవెంట్‌లో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడడం దారుణమని అన్నారు. ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది. వాళ్ల ఫ్యామిలీస్ ఆనందంగా ఉంటాయి. సినిమా వాళ్లకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని పార్లమెంటులో కూడా మాట్లాడుతున్నారు అంటే వాళ్లకేం పనీపాటా లేదా? అనిపిస్తుంది.
సినిమాలు చేస్తున్నామంటే బిజినెస్ అవుతుంది కాబట్టే. అందుకే డబ్బులు ఇస్తున్నారు. సినిమా మీద సినిమా తీస్తున్నామంటే మాకు డబ్బులు వస్తాయని కాదు సర్. మా వాళ్లకు ఉపాధి లభిస్తుందని. దేశంలో ఇంతకుమించి సమస్యన్నదే లేనట్టు పార్లమెంటులో కూడా దీని గురించి మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టకరం. సినిమాను దూరంగా ఉంచండి. మా కష్టాలేవో మేం పడతాం. ఆదరిస్తే సంతోషం. మేం ఖర్చు చేస్తున్నాం కాబట్టే తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఇంత ఖర్చు చేస్తున్నందుకు ఎంతో కొంత రావాలని కోరుకుంటాం. వీలైతే సహకరించండి. అంతేకానీ, ఇదేదో పెద్ద తప్పన్నట్టు దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో రాజ్యసభ వరకు తీసుకెళ్లొద్దని విన్నవించుకుంటున్నాను. రాజకీయ నాయకులతో పోలిస్తే సినిమా ఎంతండీ. చాలా చిన్నది. నేను అదీ చూశాను.
మీలాంటి వాళ్లు పెద్దపెద్ద విషయాల్లో జోక్యం చేసుకోవాలి. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడం వంటి వాటి గురించి తలవంచి నమస్కరిస్తాం. అంతేకానీ, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై ఏంటి సర్’’ అని చిరంజీవి ఆ ఫంక్షన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే మాటను మాత్రమే వైరల్ చేయడంతో అదికాస్తా వివాదాస్పదమైంది. కాగా, తారల పారితోషికాలపై ఇటీవల వైసీపీ ఎంపీ విజయాసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించడాన్ని దృష్టిలో పెట్టుకునే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. దీనిపై కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అంబటి, విజయసాయి రెడ్డి వంటివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యాఖ్యలని చిరంజీవి చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు అర్ధమవుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…