Ravi Krishna : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత ‘విరూపాక్ష’ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమాతో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నెల రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. చాలా కాలం తర్వాత మంచి థ్రిల్లర్ మూవీ రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇటీవలే హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై అక్కడ కూడా మంచి కలెక్షన్‌లు రాబట్టింది. ఇటివలే ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లోనూ నిలిచింది. అయితే ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ రవికృష్ణ ముఖ్య పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
విరూపాక్ష సినిమా రిలీజ్‌కి ముందు చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరులో జరిగిన ఈవెంట్‌లో రవికృష్ణ ప్రతి ఒక్కరిని పొగుడుతూ సంయుక్త మీనన్ ని సైతం ఆకాశానికి ఎత్తేశాడు. గోల్డెన్ లెగ్ అని ఆమె ఎంతగా కష్టపడుతుందో అని చెప్పుకు వచ్చాడు. అయితే ఆ సమయంలో సంయుక్త మీనన్ ఫన్నీ రియాక్షన్ ఇచ్చింది. ఇది చూసిన రవికృష్ణ నవ్వేసి ఆ తర్వాత కూడా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించాడు. చిత్రంలో సంయుక్త మీనన్ అద్భుతంగా నటించగా, ఆ సినిమా అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
తెలుగులో సంయుక్త మీనన్ సైన్ చేసిన మొదటి చిత్రం ‘బింబిసార’. కానీ విడుదలైన ఫస్ట్ మూవీ ‘‘భీమ్లా నాయక్’. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ లో రానా దగ్గుబాటికి జోడిగా నటించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీతో పలకరించి అలరించింది. ఈ సినిమా సక్సెస్ అయినా ఆ రేంజ్‌లో ఆఫర్స్ మాత్రం రావడం లేదనే చెప్పాలి. తాజాగా ధనుశ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సార్’ మూవీతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ‘విరూపాక్ష’తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. మలయాళం నుంచి వచ్చే హీరోయిన్‌లు చాలా త్వరగా క్రేజ్ తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే సంయుక్తకి కూడా త్వరగానే క్రేజ్ దక్కింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…