Ravanasura : మాస్ మహరాజా రవితేజ ఇటీవలి కాలంలో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడనుకుంటే రవన్నకు రావాణాసుర రూపంలో మరో ఫ్లాప్ చేరింది. ఇప్పటికే దాదాదాపు ఈ సినిమా చాలా వరకు థయేటర్‌లలో నుంచి వెళ్లిపోయిన రావణాసుర సినిమా కొంత మందికి వచ్చి వెళ్లినట్టు కూడా తెలియదు. అయితే చిత్రంలో రవితేజ నటన మాత్రం ఈ సినిమాలో వేరే లెవల్లో ఉంటుంది. నెగెటీవ్ క్యారెక్టర్‌లో జీవించేశాడు. ఇక సుధీర్ వర్మ కథ పరంగా వంద మార్కులు వేసుకున్నా కథనంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ అదే సమయంలో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి కాని ఈ విషయంలో సుధీర్ వర్మ ఫేయిలయ్యాడు.
రావణాసుర చిత్రం డిజాస్టర్ కలెక్షన్స్ తో ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అమెజాన్ ప్రైమ్ లో సినిమాని స్టీమింగ్ చేయడానికి రెడీ అవుతున్నార మేకర్స్ . సినిమా హిట్ టాక్ వస్తే మే నెలలో రెండవ వారం రిలీజ్ చేయాలని ముందుగా డిసైడ్ అయ్యారు. కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది అని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా ప్రేక్షకులు మూవీని తిరస్కరించడంతో ఇప్పుడు ఏప్రిల్ నెల ఆఖరులో స్ట్రీమింగ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ వారు సిద్ధం అవుతున్నట్టు ఇన్‌సైడ్ టాక్. మొత్తానికి రవితేజ కెరియర్ లో విభిన్న కథాంశంతో వచ్చిన సినిమాలు అంతగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు.
ఇప్పుడు రావణాసుర మరోసారి ఆ ఫీట్ ని కొనసాగింపుగా వచ్చిందనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఈ మూవీని దసరా కానుకగా తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన రావణాసుర సినిమాలో రవితేజ జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడలు నటించారు. అక్కినేని సుశాంత్ కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…