Dasara : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరు నిర్మించిన ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. తెలంగాణలోని ఓ గ్రామం వీర్లపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ధరణిగా నాని రగ్గడ్ లుక్ లో కనిపించగా మరో హీరోగా దీక్షిత్ ఆకట్టుకున్నాడు. ఇక వెన్నెలగా డీ గ్లామర్ పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది.
వీరితోపాటు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, సముద్ర ఖని, సాయి కుమార్, ఝాన్సీ, జరీనా వాహెబ్ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. సంతోష్ నారాయణ్ బీజీఎమ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. . 100 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతకు భారీగా లాభాల్ని మిగిల్చింది. థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. దసరా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్ దాదాపు 22 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగుతో పాటు సౌత్ లాంగ్వేజెస్‌కు సంబంధించిన హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.. మే 30 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
చిత్రంలో ధరణిగా నాని యాక్టింగ్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కంప్లీట్ డీ గ్లామర్ క్యారెక్టర్‌లో నాని ఎంతో జీవించాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2710కి పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. మొదటి రోజున నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ట్రయాంగిల్ లవ్, ఫ్రెండ్‌షిప్ బ్యాక్ డ్రాప్ లో రియలిస్ట్ రివేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ రూ. 112కి కోట్ల గ్రాస్ అందున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…