Arjun Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. క్రికెట్ దేవుడిగా సచిన్ పేరు చెబుతుంటారు. అయితే సచిన్ రిటైర్ తరువాత ఆయన తనయుడు కూడా క్రికెట్‌లో రాణించి అభిమానులకి మంచి జోష్ అందించాలని ప్రతి ఒక్కరు అనుకున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకలేకు ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. అంతేకాదు, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్ తొలి ఓవర్ వేసి బ్యాటర్లను భయపెట్టాడు. బ్యాటింగులోనూ సత్తా చాటగల అర్జున్ గతేడాది గోవా జట్టు తరపున రంజీల్లో అడుగుపెట్టి సెంచరీ చేశాడు. ఇప్పుడు కోల్‌కతాతో మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు.
లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అయిన అర్జున్ ను ముంబై 2021లో బేస్ ప్రైజ్ కు కొనుగోలు చేసింది. అయితే, అప్పటినుంచి ముంబై ఫ్రాంచేజీలో ఉన్నా.. అర్జున్ కు అవకాశాలురాలేదు.. రెండు సీజన్లు బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన అర్జున్.. తొలి ఓవర్ వేసి బ్యాట్స్ మెన్ ను తెగ భయపెట్టాడు. మొదటి ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చి మంచి స్టార్ట్ ను అందించాడు. అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. గతేడాది గోవా తరుపున రంజీల్లో అడుగుపెట్టిన అర్జున్.. సెంచరీ కూడా చేశాడు. అయితే ఈ రోజు రోహిత్ శర్మ చేతుల మీదుగా ఎంఐ క్యాప్ అందుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో సచిన్ కూతురు కూడా తెగ సందడి చేసింది. అంతక ముందు అర్జున్‌కి సచిన్ టెండూల్కర్ విలువైన సలహాలు సూచలను అందించాడు. మొత్తానికి అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌లో ఆరంగేట్రం చేయడం ఫ్యాన్స్‌కి ఫుల్ ఆనందాన్ని కలిగించింది. బౌలింగ్, రన్నప్ విషయంలో కీలక సూచనలు చేశాడు సచిన్. కెరీర్ ఆరంభంలో సచిన్ మంచి బౌలర్ అనే విషయం మనందరికి తెలుసు. ఇక అర్జున్ టెండూల్కర్ తండ్రిలా రైట్ హ్యాండర్ కాదు. లెఫ్టాండర్. లెఫ్టాండ్ మీడియం పేసర్ గా ఈ 23 ఏళ్ల కుర్రాడు అదరగొట్టబోతున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…