Gunasekhar And Samantha : సమంత నటించిన శాకుంతలం సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల మందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ అభిజ్ఞానశాకుంతం అనే పౌరాణికనాటకం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించాడు. అంతే కాకుండా అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించగా, చిన్నారి నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాను గుణశేఖర్ భారీ అంచనాల నడుమ తెరెక్కించారు. అయితే సినిమా మాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయింది. గుణశేఖర్ ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలని అనుకున్నారని కానీ ఆ ఫార్ములా కూడా జనాలను మెప్పించలేదు.
అయితే సినిమాపై అంత హైప్ వచ్చినా కూడా మూవీ ఫ్లాప్ కావడానికి గల కారణాలేంటన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి కథకి సమంతని ఎంపిక చేసుకోవడం గుణశేఖర్ చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆమెలో క్యూట్ నెస్ ఉంటుంది. కానీ ఇంత బరువైన పాత్రను మోయగల స్టామినా ఆమెకు లేదు. ఇక వి.ఎఫ్.ఎక్స్ కోసం ఇంకాస్త టైం తీసుకున్నట్లు గుణశేఖర్ దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అత్యంత నాసిరకంగా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మరి పేలవంగా ఉన్నాయి. యుద్ధం జరుగుతున్నప్పటికీ ప్రేక్షకులకు ఏదో టీవీ యాడ్ చూస్తున్న ఫీలింగ్ ను కలిగించారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ కనువిందు చేయలేకపోయింది. భారీతనాన్ని ఎక్కడా కూడా చూపించలేకపోయింది అని చెప్పాలి.
భారీ బడ్జెట్ చిత్రాలకి దర్శకుడు మాస్టర్ గా ఉండి అన్ని సరి చూసుకోవాలి. కాని గుణశేఖర్ అంతటా ఫెయిల్ అయ్యాడు. అందుకే సినిమా ఫ్లాప్ అయింది. గుణశేఖర్ మాత్రమే ఈ ఓటమి భారాన్ని మోయాల్సి ఉంటుంది. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత శాకుంతలం సినిమాకి సంబంధించిన నెగటివ్ టాక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . కాగా సమంత శాకుంతలం సినిమా బాగాలేదు అంటూ ఏకంగా సమంతకి ఓపెన్ గా చెప్పుకొచ్చాడు ఓ నెటిజన్ . దీంతో సమంత ఫుల్ ఫైర్ అయిపోయింది . ఈ క్రమంలోనే ఏకంగా ఆ యూజర్ ఐడి ని బ్లాక్ చేసి పడేసింది . దీంతో ట్విట్టర్ యూజర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ..ఏకంగా స్క్రీన్ షాట్ ను ఇప్పుడు వైరల్ చేస్తున్నాడు. ఈ క్రమంలోని సమంతకు ఇంత కోపమా ..? బాగాలేని సినిమాను బాగాలేదు అని చెప్పిన కారణంగా ఇలా చేస్తుందే అంటూ ఫైర్ అవుతున్నారు .
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…