Rashmika Mandanna : కూర్గ్ భామ రష్మిక మందన్న తెలుగు సినిమాలతో మంచి పాపులరాటీ అందుకొని ప్రస్తుతం బాలీవుడ్ లో హడావిడి చేస్తుంది. ఛలో సినిమాతోటాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. ఇక ఆ తర్వాత విజయ్‌తో గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి సినిమాలు చేశారు. తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తున్నారు. అయితే రష్మిక ఇటీవల పలు వివాదాలతో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను ప్రమోషనల్ ఈవెంట్లో రష్మిక అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. ఓ విషయంలో బాలీవుడ్ తో సౌత్ ఇండస్ట్రీని పోల్చుతూ తక్కువ చేసి మాట్లాడారు.
రష్మిక మాట్లాడుతూ.. రొమాంటిక్ సాంగ్స్ అనగానే బాలీవుడ్ గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుండి నేను బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ వింటూ పెరిగాను. సౌత్ చిత్రాల్లో ఈ తరహా రొమాంటిక్ సాంగ్స్ ఉండవు. అక్కడంతా మాస్ మసాలా ఐటెం సాంగ్స్ మాత్రమే ఉంటాయి. ఇది నా కెరీర్ లో బెస్ట్ రొమాంటిక్ సాంగ్ అని… మిషన్ మజ్ను మూవీలో సాంగ్ ని ఉద్దేశిస్తూ అన్నారు. త్‌లో ఎక్కువగా మాస్ మసాలా, ఐటెమ్ సాంగ్స్ ఉంటాయని తెలిపుతూ.. కమర్షియల్ హంగులే ఎక్కువగా ఉంటాయంటూ సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడడంతో ఇప్పుడు ఆమెపై టాలీవుడ్ ప్రేక్షకులు గరంగా ఉన్నారు.
శ్రావ్యమైన సంగీతం అంటే ఏమిటో సౌత్ ఇండియా ప్రేక్షకులకు తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్స్ వినసొంపైన సంగీతం ఇవ్వరు అనే విధంగా కూడా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. బాలీవుడ్ మ్యూజిక్ ఇష్టం అయితే… వారిని పొగడటంలో ఎలాంటి తప్పు లేదు. ఆ పేరుతో సౌత్ మ్యూజిక్ ని దిగజార్చి మాట్లాడాల్సిన అవసరం లేదు అని నెటిజన్స్ తిట్టి పోస్తున్నారు. నువ్వు కన్నడ నుంచి తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో కన్నడ చిత్రాలను తక్కువ చేసి మాట్లాడావు, ఇక ఇప్పుడు హిందీ సినిమాలలో నటించేటప్పటికి సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతున్నావ్. ఇది నీకు కరెక్ట్ కాదని, నోటి దూల కొంచెం తగ్గించుకుంటే మంచిదని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…