Rashmika Mandanna : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో రష్మిక ఒకరు. టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రష్మిక మందన చూస్తూ ఉండగానే పాన్ ఇండియా స్టార్ హోదాను కూడా అందుకుంది. ఇప్పుడు ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలలలో చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పుష్ప 2తో ఈ భామ నేషనల్ క్రష్‌గా మారిపోయింది. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం గుడ్ బై త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
మంగళవారం ముంబైలో జరిగిన గుడ్ బై ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రష్మిక పాల్గొంది. ఈ సందర్భంగా గ్లామరస్ అవుట్ ఫిట్స్ లో తన స్పైసీ అప్పీయరన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. కోటు టైప్ ష్రగ్ టాప్ తో మల్టీ-కలర్ ప్రింటెడ్ లెహంగా ధరించి అద్భుతంగా కనిపించింది. రష్మిక లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే అదే డ్రెస్ లో ప్రసిద్ధ లాల్ బాగ్చా వినాయకుడి ఆశీస్సులు తీసుకోవడం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది. అందాలు కనిపించేలా డ్రెస్ ధరించి వినాయకుని ఆశీస్సులు అందుకోవడానికి వెళ్లడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు.
రష్మిక ఇటీవల తన డ్రెస్సింగ్ వలన నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతుంది. పొట్టి పొట్టి దుస్తులు ధరించి నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆమెని తెగ ఆడేసుకుంటున్నారు. ఆ మధ్య పొట్టి దుస్తులలో రష్మిక కనిపించే సరికి దుస్తులు వేసుకోవడం పూర్తిగా మరిచావా ఏంటి అంటూ చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఏదేమైన నేషనల్ క్రష్ గా ప్రస్తుతం మంచి డిమాండ్ ఏర్పరచుకున్న రష్మిక మందన్న ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం సక్సెస్ అవుతుంది. మొదటినుంచి కూడా ఈ బ్యూటీకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…