Samantha : ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది సమంత. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఓవర్ నైట్‌లో ఆమెకి ఏదీ రాలేదు. ఈ పేరు ప్రఖ్యాతలు పొందడం కోసం చాలా కష్టపడింది. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. సినిమా పరిశ్రమలోను, వ్యక్తిగత జీవితంలోను సమంతకు ఎదురైన ఆటుపోట్లు అన్నీ ఇన్నీ కావు. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంతను ఒక్కొక్కరు దారుణంగా ట్రోల్స్ చేసిన కూడా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది.
ఒకప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసుకుంటూ వచ్చింది సమంత. అయితే కొన్నాళ్లుగా చాలా సైలెంట్ అయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనే సమాచారం కూడా ఎవరి దగ్గర లేదు. అయితే సమంత వేద పాఠశాలలో కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయగా, వాటికి సంబంధంచిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎందుకోసం సమంత ఇలా సడెన్‌గా పూజలు చేస్తుందనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుపుతున్నారు.
తన మాజీ భర్త నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుండి సమంత చాలా మూడీగా కనిపిస్తుంది. వెండితెరపై సంతోషంగా కనిపించినప్పటికీ, ఆమె లోపల బాధను అనుభవిస్తోందని అంటున్నారు. ఆమె పూజలు చేయడం వెనుక ఈ కారణాలు కూడా ఉండి ఉండవచ్చు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సమంత బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె అక్షయ్ కుమార్ సరసన ఓ సినిమా చేస్తోంది. అలాగే సమంత నటించిన యశోద, శాకుంతలం, ఖుషీ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…