Rashmi Gautam : రష్మి గౌతమ్.. పరిచయం అక్కర్లేని పేరు.. బుల్లితెరకు తనదైన అందాలు అద్దిన గ్లామర్ క్వీన్ రష్మి. ఒకప్పుడు సినిమాల్లో చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు ఈ భామకు.. కానీ జబర్దస్త్ పుణ్యమా అని దెబ్బకు జాతకమే మారిపోయింది. అక్కడ్నుంచి తగ్గేదే లే అంటూ హద్దులు మీరి గ్లామర్ షో చేస్తుంది రష్మి. ఏదైనా మితంగా తింటే ఆహారం.. అతిగా తింటే విషం.. అందాల ఆరబోతలోనూ అంతే. అంతంత మాత్రంగా చూపిస్తేనే ఆవురావురమంటూ చూస్తారు. అలా కాదని మొత్తం చూపించేస్తే చూడ్డానికి ఇంకేం ఉండదు.. అసహ్యం తప్ప.
ఇప్పుడు రష్మిని చూస్తే ఇదే అనిపిస్తుంది. అప్పట్లో గుంటూర్ టాకీస్ కోసం సెగలు పుట్టించింది ఈ భామ. అవి చల్లారక ముందే రెచ్చిపోతూనే ఉంది రష్మి. అస్సలు తగ్గేదే లేదన్నట్లు అంతం, రాణి గారి బంగళా.. ఇలా ఏ సినిమా పడితే అందులో అందాలన్నీ ఆరబోసింది. కెమెరాకు తన అందాలన్నీ బేరం పెట్టేసింది ఈ జబర్దస్త్ భామ. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నాళ్ళైనా ఇంకా ఎవ్వరూ తనను పట్టించుకోవట్లేదనే కసో.. లేదంటే వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా ఒడిసి పట్టుకోవాలనో తెగింపో తెలియదు గానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది రష్మి. ఓ సారి హద్దు దాటిన తర్వాత మళ్లీ దాటితే ఏంటి అనుకుందో ఏమో.. ప్రతీసారి అదే చేస్తుంది.
అప్పట్లో ఫస్ట్ టైమ్ కాబట్టి గుంటూర్ టాకీస్‌కు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. కానీ ప్రతీసారి అవే అందాలంటే ఎవ్వరికైనా వెగటు పుడుతుంది. ఇదే ఇప్పుడు రష్మి పాలిట శాపంగా మారుతోంది. అంతం, రాణి గారి బంగళా సినిమాలు ఎప్పుడొచ్చాయో.. ఎప్పుడెళ్లాయో కూడా క్లారిటీ లేదు. రష్మిని చూపించి బిజినెస్ చేసుకుందామని కలలు కన్న దర్శక నిర్మాతలకు ఊహించని షాక్ తగులుతుంది. కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వచ్చేలా కనిపించట్లేదు. ఇదంతా ఆమె ప్రొఫెషనల్.. కానీ పర్సనల్‌గా మాత్రం రష్మి చాలా ఎమోషనల్.. పైగా సాఫ్ట్. నాన్ వెజ్ తినదు.. కనీసం పాలు కూడా తాగదు. ఎందుకో తెలుసా.. ఆ పాలు కావాలన్నా కూడా మూగ జీవాలను హింసించాల్సి వస్తుందని ఆమె భావన.
అక్కినేని అమల మాదిరే రష్మి కూడా జంతు ప్రేమికురాలు. వాటికి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఈమె కంట నీరు వచ్చేస్తుంది. ఆ మధ్య కరోనా అప్పుడు కూడా అంతా మనుషులకు సాయం చేస్తే ఈమె మాత్రం కుక్కలు, పిల్లులకు సాయం చేసింది. ఇప్పుడు కూడా జంతువుల గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మనం మనుషులుగానే పుట్టాం కదా.. అందుకే నోరు లేని జంతువులకు హెల్ప్ చేయకపోయినా ఫర్లేదు కానీ వాటిని హింసించొద్దు.. ప్రతి మనిషికి మూగజీవాలకి హెల్ప్ చేసేంత స్థోమత ఉండకపోవచ్చు.. కానీ హింసించకుండా ఉండే మనసు మాత్రం ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీరు మూగజీవాలకు హెల్ప్ చేయకపోయినా ఫర్లేదు కానీ హింసించకండి అని రాసుకొచ్చింది రష్మి. ఈ పోస్ట్ బాగానే వైరల్ అవ్వడం కాదు.. అందరినీ ఆలోచింపజేస్తుంది కూడా.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…