Jayaprada : శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నేద‌ట‌.. కార‌ణం అదే..!

Jayaprada : శ్రీదేవి, జయప్రద ఇద్దరూ టాప్ స్టార్ హీరోయిన్స్. తెలుగులో ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించారు. శ్రీదేవి, జయప్రద ఇద్దరూ ఒకేసారి బాలీవుడ్ కి వెళ్లారు. బాలీవుడ్ లో శ్రీదేవి సూపర్ స్టార్ అవ్వగా, జయప్రద బాలీవుడ్ లో కొంతకాలం మాత్రమే టాప్ హీరోయిన్ గా ఉంది. ఇద్దరు కలిసి ఎన్ని సినిమాల్లో నటించినా ఇద్దరికీ అసలు పడేది కాదు. తెర మీద చాలా అన్యోన్యంగా కలిసి నటించే ఇద్దరు హీరోయిన్స్ అసలు మాట్లాడుకునేవారు కాదంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళితే..

30 సంవత్సరాల క్రితం శ్రీదేవి తెలుగు, తమిళంలో అప్పుడే పేరు తెచ్చుకుంటున్న నటి. శ్రీదేవికి బాగా కలిసివచ్చిన సినిమాను హిందీలో కూడా తీశారు. ఆ సినిమాలో అమూల్ పాలేకర్ తెలుగులో చంద్రమోహన్ చేసిన పాత్రను చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత జయప్రద హిందీలో సర్గమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో జయప్రద నటించిన సిరిసిరిమువ్వ సినిమా రీమేక్. తెలుగులో హిట్ అయిన ఈ సినిమా హిందీలో ఫ‌ర్వాలేదని అనిపించింది. ఈ సినిమాలో రిషి కపూర్ హీరోగా నటించాడు.

Jayaprada and Sridevi not talked to each other for 25 years
Jayaprada

ఈ పరిస్థితిలో శ్రీదేవి కన్నా జయప్రదదే పైచేయి అయింది. ఆ తర్వాత శ్రీదేవి హిమ్మత్ వాలా, మవాలి, జస్టిస్ చౌదరి మూడు సినిమాల్లో నటించింది. ఈ మూడు సినిమాలు కృష్ణ సంస్థ పద్మాలయ స్టూడియో నిర్మించింది. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వటంతో శ్రీదేవి ఆల్ ఇండియా స్టార్ అయిపోయింది. ఇదే సమయంలో జయప్రద రేసులో వెనకపడిపోయింది. దాంతో జయప్రద నేను పుట్టుకతోనే అందంగా పుట్టాను. శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీతో అందం తెచ్చుకుంది. ఆమెతో నాకేమిటి పోలిక అంటూ మాట్లాడింది.

ఆ మాటలు అలా అలా శ్రీదేవికి చేరటంతో వీరిద్దరూ కలిసి ఏ సినిమాలో నటించినా వీరి మధ్య కోల్డ్ వార్ నడిచేది. వీరిద్దరిని కలపాలని చాలా మంది ట్రై చేసినా వర్క్ అవుట్ కాలేదు. బాలీవుడ్ నటుడు జితేంద్ర వీరిద్దరినీ మేకప్ రూమ్ లో ఉంచి బయట గడియ పెట్టారు. కొంచెం సేపు అయ్యాక చూస్తే ఎవరికి వారే గోళ్లు గిల్లుకుంటూ ఉన్నారే కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదట. ఎన్ని విభేదాలు ఉన్నా తెరపై మాత్రం ఇద్దరూ చాలా సన్నిహితంగా, అక్కచెల్లెళ్లుగా నటించటం గొప్పే మరి. వీరిద్దరి మధ్య వైరాన్ని జయప్రద చెల్లి కొడుకు పెళ్లి తీర్చింది. వీరి మధ్య ఇంత నిశబ్దం ఉన్నా ఈ 25 సంవత్సరాల కాలంలో ఒకరి గురించి మరొకరు నోరు జారిన సందర్భాలు కూడా అసలు లేవు. అందుకే వారు సూపర్ స్టార్స్ అయ్యారు.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago