Nagababu : ఎంతో ప్రశాంతంగా సాగాల్సిన అలయి బలయ్ కార్యక్రమం కాస్తా.. చిరు, గరికపాటి ఇష్యూతో ఈ సారి కాస్త వివాదం అయింది. అందులో తప్పు ఎవరిది అనే విషయం పక్కనబెడితే చిరంజీవి హూందాతనం మాత్రం అందరి చేత ప్రశంసల వర్షం కురిపించేలా చేస్తుంది. తన తప్పు లేకపోయినా కూడా గరికపాటి నరసింహారావుతో ఆయన ప్రవర్తించిన తీరు చిరు ఇమేజ్‌ను ఇంకాస్త పెంచేసింది. అయితే ఇందులోకి నాగబాబు రావడం.. ఇప్పుడు మెగా అభిమానులు ఎంట్రీ ఇవ్వడం.. గరికపాటిని సపోర్ట్ చేస్తూ బ్రాహ్మణ సంఘాలు వకాల్తా తీసుకోవడంతో ఇష్యూ ఎటెటో వెళ్లిపోతుంది. దీనికి బీజం బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్‌లో పడింది. ప్రతి సంవత్సరం దసరా తర్వాత రోజు అలై బలై ఏర్పాటు చేయడం బండారి దత్తాత్రేయకు అలవాటు. ఈ సారి ఆయన కూతురు దీన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో చిరంజీవితోపాటు ఇంకా చాలామంది పాల్గొన్నారు.
అందులోనే గరికపాటి నరసింహారావు ఉన్నారు. చిరంజీవిని చూసిన అభిమానులు.. ఆయన్ని స్టేజి దగ్గరికి కూడా రానీయకుండా మధ్యలోనే ఆపేసి ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ఆయన అందరితో ఓపికగా ఫోటోలు దిగుతూ స్టేజిపైకి రావడానికి చాలా సమయం తీసుకున్నారు. ఇదే సమయంలో స్టేజ్ మీద గరికపాటి ప్రసంగించడం మొదలుపెట్టారు. కానీ చిరంజీవి అక్కడ ఫోటోలు దిగుతుండడంతో ఆసహనానికి లోనైన ఆయన.. చిరంజీవి వెంటనే స్టేజి మీదకి రాకపోతే తాను అక్కడ నుంచి వెళ్ళిపోతాను అని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఆ విషయం తెలిసి చిరంజీవి కూడా వెంటనే స్టేజి మీదకి వచ్చారు. గరికపాటికి క్షమాపణ కూడా చెప్పారు. దీన్ని ఉద్దేశించి నాగబాబు వెంటనే ఒక ట్వీట్ చేశారు. ఏపాటి వారికైనా చిరంజీవి క్రేజ్ చూస్తే ఆ పాటి అసూయ కలగడం పరిపాటే అంటూ మెగా బ్రదర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదంతా ఇలా ఉంటే గరికపాటి పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆయన కాలేజీ రోజుల్లో ఉన్నపుడు ఎన్టీఆర్ అభిమానినని.. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫ్యాన్స్ మధ్య తరచుగా గొడవలు జరిగేవని చెప్పారు. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన తాను.. ఏఎన్నార్ సినిమా విడుదలైతే పోస్టర్స్‌పై పేడ వేయడం కూడా చేశామంటూ చెప్పుకొచ్చారు ఆ వీడియోలో గరికపాటి. మరి అప్పుడు ఎన్టీఆర్ అభిమానిగా ఆయన చేసింది కరెక్టే అయితే.. ఇప్పుడు చిరంజీవిపై అభిమానంతో ఫోటోలు దిగడం ఎలా తప్పు అవుతుందని.. ఆ కాసేపు ఆయన ఓపిక పట్టలేకపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ సీన్ ఇంకా ఎన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అవుతుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…