Ranbir Kapoor : అలియా భ‌ట్ తండ్రిపై ఫుల్ సీరియ‌స్ అయిన రణ్‌బీర్ క‌పూర్..!

Ranbir Kapoor : బాలీవుడ్ చాక్లెట్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ర‌ణ్‌బీర్ క‌పూర్ రీసెంట్‌గా యానిమ‌ల్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌ష్మిక క‌థానాయిక‌గా నటించింది. చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో పాటు ర‌ణ్‌బీర్ న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. త్రిప్తి దిమ్రి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించి యువతను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలైన దగ్గర నుంచి ఎన్నో ప్రశంసలు వాటితో పాటు ఎన్నో విమర్శలు కూడా తెచ్చుకుంది. కొంతమంది ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తగా మరి కొంతమంది పాతాళానికి తోసేలా విమర్శలు కురిపించారు.

అయితే ఎవరు ఏమన్నా కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి రోజు నుంచే భారీగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఫైనల్ రన్ లో 800 కోట్ల క్లబ్బులో చేరింది. నాన్న సెంటిమెంట్, లవ్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో యానిమల్ సినిమా అందర్నీ అబ్బురపరిచింది.యానిమల్ సినిమా ఇంతటి భారీ విజయం సాధిచడంతో చిత్రయూనిట్ ముంబైలో నిన్న రాత్రి భారీ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి యానిమల్ చిత్ర యూనిట్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా విచ్చేశారు. రణబీర్ తన భార్య ఆలియాతో కలిసి వచ్చాడు. అలాగే మహేష్ భట్, నీతూ కపూర్, రష్మిక మందన్న, తమన్నా, త్రిప్తి దిమ్రి, బాబీ డియోల్, మానుషీ చిల్లర్, హిమేష్ రేష్మియా, ఆర్జీవీ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్.. ఇంకా అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలు యానిమల్ సక్సెస్ పార్టీకి వచ్చి సందడి చేశారు.

Ranbir Kapoor full serious on mahesh bhatt
Ranbir Kapoor

దీంతో యానిమల్ సక్సెస్ పార్టీ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఓ విష‌యంలో ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్ తండ్రి మ‌హేష్ భ‌ట్ గొడ‌వ ప‌డుతున్న‌ట్టు క‌నిపించింద‌ని, వారు అలా గొడ‌వ ప‌డ‌డానికి కార‌ణం ఏమై ఉంటుంద‌ని నెటిజ‌న్స్ ముచ్చ‌టించుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా, ఇందులో అలియా భ‌ట్ లుక్ చూసి కూడా కొంద‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago