Guntur Kaaram Public Talk : సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి బరిలో మహేష్ బాబు సినిమా అంటే పందెంకోడి కాలుకి కత్తి కట్టినట్టే. బాబుగారి బొమ్మపడిందంటే బాక్సాఫీస్ పందెం కొట్టినట్టే. అందులోనూ.. గురూజీ, మహేష్‌జీలది ప్రామిసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా, అన్ని వర్గాల ప్రేక్షకులు మూవీ చూసేందుకు ఆసక్తి చూపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ 35m ఎంఎం థియేటర్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులు నమ్రతాశిరోద్కర్, గౌతమ్ మరికొందరు కలిసి సినిమా చూశారు. ప్రిన్స్ మహేష్ ఫ్యామిలీ గుంటూరు కారం మూవీ చూస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, వంశీ పైడిపల్లితో పాటు మరికొందరు చిత్ర యూనిట్ ఈసినిమాను అభిమానుల మధ్యలో కూర్చొని చూశారు. అయితే గుంటూరు కారం బినిఫిట్ షో తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకుంది.చాలా రోజుల తర్వాత మహేష్ ఊర మాస్ పాత్రలో నటించడంతో అభిమానులు థియేటర్లలో ఫైట్స్, డైలాగ్స్ కి ఈలలు వేస్తూ కేరింతలతో థియేటర్లు దద్దరిల్లేలా అరుస్తూ సందడి చేస్తున్నారు. ఇక థియేటర్ పై రివ్యూలు కూడా సూపర్ డూపర్ హిట్ అని రేటింగ్ ఇచ్చాయి. అయితే కొందరు ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ పై ఘోరమైన విమర్శలు చేస్తున్నారు.
గుంటూరు కారం’లో మహేష్ బాబు మెప్పించాడు.. త్రివిక్రమ్ నిరాశపరిచాడు. ‘గుంటూరు కారం’లో కథకి కావాల్సిన మమకారం లేదు.. అనుకున్నంత ఘాటూలేదు. ఫ్యాన్స్ వరకూ కుర్చీ మడతపెట్టొచ్చు.. కలెక్షన్లకు కొదువేం ఉండదు.. బట్ భారీ అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశ తప్పదు అని ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగానే చెబుతున్నారు.త్రివిక్రమ్ కొంత ఘాటు పెంచి ఉంటే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేదని కొందరి మాట.దిల్ రాజు కూడా మూవీపై భారీ హైప్ పెంచాడు. కాని అనుకున్నంతగా సినిమా లేదని కొందరి మాట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…