Ram Gopal Varma : ఇటీవల రామ్ గోపాల్ వర్మ సినిమాల కన్నా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా వైసీపీని విమర్శించే వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు వ్యూహం అనే పేరుతో సినిమా కూడా చేస్తున్నారు. ఇందులో లోకేష్‌తో పాటు పవన్, చంద్రబాబులని విమర్శించబోతున్నారు.అయితే దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ వర్మని థర్డ్ గ్రేడ్ అంటూ విమర్శించారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్.. నేను థర్డ్ గ్రేడా? ఫిఫ్త్ గ్రేడా? అన్నది ముఖ్యం కాదు.. నా ప్రశ్న ఏంటంటే.. మా నాన్న ఎక్కడో చిన్న ఉద్యోగం చేసేవారు.
అక్కడి నుంచి నాకు నేనుగా సినిమాల్లోకి వచ్చి డైరెక్షన్ చేశానని అన్నారు. హిట్లు తీశాను, ఫ్లాపులు, సూపర్ ఫ్లాపులు కూడా తీశాను. మీరేమో చంద్రబాబు నాయుడు అనే పెద్ద నాయకుడికి పుట్టారు. ఆయన మిమ్మల్నే కనాలనుకోలేదు, కానీ మీరు పుట్టారు. దాన్ని బయాలజికల్ యాక్సిడెంట్ అంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆర్జీవీ. మీరేం సాధించారు? నేనేం సాధించాను? అనేది పక్కపక్కనే ఓ జాబితా తయరు చేసుకుని చూసుకోండని అన్నారు. అయినా నేను థర్డ్ గ్రేడ్ అంటే మరి మీరేం గ్రేడో..! మీ తండ్రిని పక్కనపెట్టేస్తే మీరు అరవడం తప్పిస్తే ఏం చేశారు? అనేది నాకింతవరకు అర్థం కాలేదని ఆర్జీవీ చెప్పారు.
మీరు రాజకీయ నాయకులు.. మీ ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో నాకు తెలియదు. ప్రతిరోజు వందల సినిమా షూటింగ్స్ జరుగుతాయి. నాకొక్కరికే కాదు, అందరికీ షూటింగ్‌కు అనుమతి ఇస్తారు. షూటింగ్ పర్మిషన్‌కు, మీటింగ్ పర్మిషన్‌కు మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదని తెలిపారు. కాగా, ఇటీవల రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమా షూటింగ్ ప్రకాశం బ్యారేజ్ పై జరిగింది. వర్మ సినిమాకు పర్మిషన్ ఇస్తారు కానీ, తన పాదయాత్రకు మాత్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని నారా లోకేష్ ఓ ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఆయన ఓ థర్డ్ గ్రేడ్ సినిమాలు చేసే డైరెక్టర్ అంటూ సెటైర్లు పేల్చారు. ఆ సెటైర్లకు వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అసలు లోకేష్ పుట్టుక ఓ బయలాజికల్ యాక్సిడెంట్ అని అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…