Ram Charan : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న తెల్లవారుఝామున 1.49ని.లకి పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఈ వార్త బయటకు రావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులలో కూడా సందడి వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు ఎప్పుడు బిడ్డ బయటకు వస్తుందా అని చూసిన అభిమానులు ఇప్పుడు ఆ పాపకి ఏ పేరు పెడతారు, పాపని ఎప్పుడు చూపిస్తారు అంటూ ఎదురు చూస్తున్నారు. జూన్ 23 మధ్యాహ్నం.. బిడ్డతో కలిసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఉపాసన. అనంతరం ఉపాసన .. తన బిడ్డ, భర్తతో కలిసి ఓ పిక్ షేర్ చేసారు. ఇక రామ్ చరణ్ చేతిలో వాళ్లు పెంపుడు కుక్కతో ఉండటం విశేషం. ఈ ఆనంద క్షణాలు మరవలేనివి అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అయితే డిశ్చార్జ్ తర్వాత రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ తన ఆనంద క్షణాలని పంచుకున్నారు. డాక్టర్ సుమన, డాక్టర్ రుమ, డాక్టర్ లత, డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ అమితా ఇంద్రసేన, తేజస్విగారు సహా ఎంటైర్ అపోలో టీమ్‌కి థాంక్స్. చాలా బాగా చూశారు. మేమెంతో లక్కీ. ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఉపాసన, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇంత మంచి డాక్టర్స్ టీమ్ కుదిరారు కాబట్టి ఎలాంటి భయం లేదు. అలాగే మా అభిమానుల ప్రార్థనలు, వాళ్లు చేసిన పూజలు గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్లను ఎప్పటికీ మరచిపోలేను. ఇంతకన్నా వాళ్ల దగ్గర నుంచి నేనేం అడుగుతాను. అలాగే అన్నీ దేశాల నుంచి మా శ్రేయోభిలాషులు, ఇతరులు ఆశీస్సులు అందించారు.
ఇక పవన్ కళ్యాణ్ బాబాయ్ ఏపీలో రాజకీయాలతో బిజీగా ఉండడం వలన రాలేకపోయారు. నాకు వెంటనే ఫోన్ చేసి నన్ను సరదాగా డాడీ అని పిలుస్తున్నారు అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత ఉపాసన పాపకి జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ ఆనందం అంతా ఇంతాకాదు. ఇక ఉపాసన పండంటి పాపకు జన్మనివ్వడంతో కొద్ది రోజులు షూటింగ్ కు దూరంగా ఉంటారని అందరూ భావించారు. కానీ అలాంటివేవీ లేవని.. చరణ్ షూట్ కు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ ‘ఇండియన్ 2’తో బిజీగా ఉన్నారు. త్వరలోనే గేమ్ చేంజర్ షూట్ రెస్యూమ్ కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…