Actor Shivaji : టాలీవుడ్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వచ్చారు. 2014లో పవన్ కళ్యాణ్ ఈ పార్టీని స్థాపించి ఈ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నారు.గత కొద్ది రోజులుగా పవన్ రాజకీయాలలోచాలా బిజీగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేధావి వర్గంతో సమావేశాలు జరుపుతున్నారు. అలానే వారాహి యాత్రలో భాగంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను, ప్రజలకు జరిగిన నష్టాలను ప్రజలకు పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు. శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కొద్దని.. ఆ దిశగా మనమంతా పని చేయాలన్నారు.
మొదటి నుంచి ఓ నిర్దిష్ట విధానంలో తాను బతకాలని అనుకున్నానని.. క్రమశిక్షణతో పాటు సమాజాన్ని చదువుతూ ముందుకెళ్లగలిగానని చెప్పుకొచ్చారు . . నన్ను చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయి నుంచి, మిమ్మిల్ని చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయికి ప్రజలను తీసుకురావాలి. వారి కష్టాల్లో, కన్నీళ్లలో జనసేన ప్రతినిధులుగా మీరు తోడుగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఊపు చూస్తుంటే ఈ సారి రాజకీయాలలో చరిత్ర సృష్టిస్తాడని కొందరు చెప్పుకొస్తున్నారు. తాజాగా హీరో శివాజీ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్నించే నినాదంతో ఆయన రాజకీయాలలోకి వచ్చారు. ఈ సారి ఆయన వైసీపీని గట్టిగా ఢీకొడతారు. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టిస్తాడని అన్నారు. పోసాని కృష్ణ మురళి.. పవన్ కళ్యాణ్ పై చేసే వ్యాఖ్యలని నేను గౌరవిస్తాను, కాని ఏకీభవించను. ఎవరి అభిప్రాయం వారిది అని ఆయన అన్నారు. ఈ సారి మాత్రం పవన్ కళ్యాణ్‌కి మంచి రిజల్ట్ రావడం ఖాయం అని శివాజీ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో తాను జగన్ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో చెప్పానని, ఇప్పుడు అలానే జరుగుతుందని శివాజీ స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…