Dimple Hayathi : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఎంతో గుర్తింపు పొందారు. సమంత, నాగ చైతన్య విడిపోతారని ఈయన చెప్పడం అది నిజం కావడంతో వేణు స్వామికి మంచి పాపులారిటీ దక్కింది. ఈ క్రమంలోని వేణు స్వామి తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్‌గా రామ్ చరణ్ కూతురు గురించి కూడా జాతకం చెప్పాడు. అయితే ఎప్పుడు నెగెటివ్‌గా జాతకాలు చెప్పే వేణు స్వామి .. రామ్ చరణ్ కూతురు జాతకం విషయంలో మాత్రం చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు.
ఇకపోతే వేణు స్వామి ఎవరి జాతకంలోనైనా దోషాలు కనుక ఉంటే ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం సెలబ్రెటీలు కూడా వేణు స్వామితో ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో రష్మిక మందన్న వేణు స్వామితో తన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేయించారు.ఇదే విషయాన్ని వేణు స్వామి వెల్లడించారు.అందుకు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక ఆ తర్వాత వేణు స్వామి..నిధి అగర్వాల్ ఇంట్లో కూడా పూజలు చేశారు. పింక్ కలర్ డ్రెస్ ధరించి వేణు స్వామి బృందం చెప్పిన విధంగా వేదమంత్రాల నడుమ కలశానికి పూజలు చేశారు. జాతక దోషం కారణంగా ఆమె పూజలు చేయించుకున్నట్టు సమాచారం.
ఇక తాజాగా హాట్ బ్యూటీ డింపుల్ హయతి కూడా తాజాగా వేణుస్వామితో పూజలు చేయించుకుంది. వేద మంత్రాల నడుమ ఈ అమ్మడు ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక డింపుల్ హయతి విషయానికి వస్తే.. .గల్ఫ్ సినిమాతో ఈమె సినీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత హరీష్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఈమె చేసిన స్పెషల్ సాంగ్ వల్ల బాగా పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ తర్వాతనే ఈమెకు అడపాదడపా అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం డింపుల్.. శంకర్- కమల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…