Meher Ramesh : వాల్తేరు వీరయ్య చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం భోళా శంకర్. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్‌కి సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ హంగులతో తెరకెక్కిన ఈ టీజర్ లో చిరు ట్రేడ్‌మార్క్ స్టైల్ తో మెగా ఫ్యాన్స్ మైమరిచిపోతున్నారు. మెహర్ తో పాటుగా మెగాస్టార్ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్ లు కూడా మెగా ఫ్యాన్స్ కి నచ్చడం మరో బిగ్ ప్లస్ అయ్యింది. దీనితో టీజర్ చూసాక అయితే చాలామందికి పర్లేదు మినిమమ్ గ్యారెంటీ అనే టాక్ అయితే వినిపిస్తుంది.
33 మందిని దారుణంగా చంపిన వ్యక్తి కోసం కోల్‌కతా పోలీసులు వెతుకుతున్నారని చెప్పే వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమవుతుంది. చిరంజీవి ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో తన స్వాగ్, స్టయిల్ తో అదరగొట్టారు. డెన్‌లో గూండాలను చితకొట్టి “షికార్ కొచ్చిన షేర్ ని బే…” అని చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా పేలింది. “ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే… అన్ని ఏరియాలు అప్నా హై… నాకు హద్దుల్లేవ్… సరిహద్దుల్లేవ్… 11 ఆగస్ట్ దేఖ్‌లేంగే…” అంటూ మెగాస్టార్ చెప్పిన చివరి డైలాగ్ ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా మాస్ ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని అంటున్నారు.
అయితే టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు మెహర్ రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మెగాస్టార్ గారిలో మనకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో వుంటాయి. అభిమానులని, ప్రేక్షకులని అందరినీ ఈ సినిమా అలరిస్తుంది. నిర్మాత అనిల్ సుంకర గారితో పాటు అందరం మెగాస్టార్ గారికి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలని ప్రేమతో కష్టపడ్డాం. బాలీవుడ్ లో అనే సూపర్ హిట్ చిత్రాలు పని చేసిన కెమెరామెన్ డడ్లీ గారు ఈ చిత్రానికి అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మహతి సాగర్ మెగా సౌండ్ క్రియేట్ చేశారు. ప్రేక్షకులని అభిమానులని అలరించాలని చిరంజీవి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన వేగాన్ని అందుకోవడం మనకి కష్టం. ఇక నుంచి మెగా సెలబ్రేషన్స్ , భోళా మానియా బిగిన్. అభిమానుల్లో నుంచి వచ్చి దర్శకుడైన నేను మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తానని నమ్మకంతో చెబుతున్నాను’’ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…