OTT : ప్రతి వారం థియేటర్‌తో పాటు ఓటీటీలోను పలు చిత్రాలు సందడి చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి ప్రేక్షకులు థియేటర్ కంటెంట్ కన్నా ఓటీటీ కంటెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదల కాలేదు ఇక ఓటీటీలో మాత్రం పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదల అయ్యాయి.. ఒకటి రెండు కాదు, ఏకంగా 20కి పైగా కొత్త సినిమాలు ఈ వారంలో స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో ‘ద కేరళ స్టోరీ’, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్‘. ‘ఏజెంట్‘, ‘ఇంటింటి రామాయణం’, ‘జాన్ విక్ 4’ సహా పలు సినిమాలు ఉన్నాయి. థియేటర్‌లో జూన్ 23న మను చరిత్ర సినిమా విడుదలైంది. నో హార్డ్ ఫీలింగ్స్ అనే ఇంగ్లీష్ చిత్రం జూన్ 23న విడుదలైంది.
భీమదేవరపల్లి బ్రాంచి అనే చిత్రం కూడా జూన్ 23న థియేటర్స్ లో రిలీజైంది.భారీ తారాగణం అనే చిత్రం, కర్ణ అనే తెలుగు చిత్రం కూడా జూన్ 23న విడుదలయ్యాయి. అశ్విన్స్ అనే సైకాలిజికల్ చిత్రం కూడా జూన్ 23న థియేటర్స్ లో విడుదలైంది. థలైంగరమ్, ఎలిమెంటల్, 1920, మా ఆవారా జిందగీ కామెడీ చిత్రం,థాన్ డర్టీ అనే తమిళ చిత్రంతో పాటు పలు చిత్రాలు కూడా జూన్ 23న విడుదలయ్యాయి. ఇక నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్ళీపెళ్లి సినిమా జూన్ 23న ఆహాతో పాటు ఆమెజాన్ ప్రైమ్ ఓటీటీలలో రిలీజ్ అయింది.
రాహుల్ రామకృష్ణ నవ్యస్వామి నాయకానాయికలుగా నటించిన చిన్న సినిమా ఇంటింటిరామాయణం జూన్ 23 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సల్మాన్‌ఖాన్, పూజాహెగ్డే జంటగా నటించిన బాలీవుడ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీజాన్ జీ5 ద్వారా జూన్ 23న ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ మూవీ సోని లివ్ ఓటీటీలో జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నవాజుద్ధీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ జంటగా నటించిన టీకూ వెడ్స్ షేరూ మూవీ ఆమెజాన్ ప్రైమ్‌లో శుక్రవారం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. కేరళ క్రైమ్ ఫైల్స్ (మలయాళం వెబ్‌సిరీస్), సీక్రెట్ ఇన్వేషన్(ఇంగ్లీష్ వెబ్‌సిరీస్), క్లాస్ ఆఫ్ 9 (వెబ్‌సిరీస్), వరల్డ్స్ బెస్ట్ చిత్రాలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో చూస్తే.. క్యాచింగ్ కిల్లర్ సీజన్ 3, టేక్ కేర్ ఆఫ్ మాయ, బ్రేక్ పాయింట్, సోషల్ కరెన్సీ, థ్రో మై విండో ఎక్రాస్ ది సీ, ఐ నంబర్ నంబర్ జోజీ గోల్డ్, స్కల్ ఐస్ లాండ్, జాన్ విక్ 4 – లయన్స్ గేట్ ప్లే – జూన్ 23నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…