Rakesh Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి తో అందరు షాక్ అయ్యార.. తన విచిత్రమైన యాటిట్యూడ్, నిర్మొహమాటంగా చేసే విమర్శలు అతనికి యూట్యూబ్‌లో స్టార్‌డం తెచ్చిపెట్టాయి. ఇటీవల బిగ్ బాస్ షోకు పారడీగా ఈ మధ్యే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ‘మ్యాన్షన్ హౌస్ మై హౌస్’ అని ఒక రియాలిటీ షోను రాకేష్ మాస్టర్ మొదలుపెట్టారు. అగ్గిపెట్టి మచ్చ, స్వాతినాయుడు, సునిశిత్, ఉప్పల్ బాలు వంటి యూట్యూబ్ స్టార్లతో ఈ షో మొదలు పెట్టారు. విజయనగరం శివారులోని ఓ రిసార్ట్స్‌లో ఈ షో షూటింగ్ చేశారు. అయితే ఆయన అనారోగ్యానికి గురి కావడంతో వారం క్రితం హైదరాబాద్‌కి వచ్చారు.
రెండు రోజులుగా రక్తపు విరోచనాలు కావడంతో ఆయనని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. అయితే అంత బ్రతకు బ్రతికిన రాకేష్ మాస్టర్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూయడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణంగా గాంధీ ఆసుపత్రి అంటే సాధారణ ప్రజలు మాత్రమే అక్కడ వైద్యం తీసుకుంటారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి డ్యాన్స్ నేర్పిన రాకేష్ మాస్టర్ గాంధీలో మృతి చెందడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాకేష్ మాస్టర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన బతకడం కష్టమని రెండు నెలల క్రితమే వైద్యులు చెప్పారట. గతంలో ఆయన ‘హనుమాన్’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలోనే రక్తపు వాంతులు, విరేచనాలు అయ్యాయని చెప్పారు. అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తే అన్ని రకాల పరీక్షలు చేయడంతో ఆయన పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ఆయన 1968 సంవత్సరంలో తిరుపతిలో జన్మించారు. ‘ఆట’, ‘ఢీ’ వంటి పాపులర్ డ్యాన్స్ రియాల్టీ షోల ద్వారా ఆయన కెరీర్ ను ప్రారంభించారు. దాదాపు 1500 సినిమాలకు రాకేష్ కొరియోగ్రాఫర్ గా చేశారు. ప్రస్తుతం తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్ లుగా కొనసాగుతోన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…