Shekhar Master : ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం అనూహ్యంగా కన్నుమూసారు. మొన్నటి వరకు సోషల్ మీడియాలో తెగ సందడి చేసిన రాకేష్ మాస్టర్ ఉన్నట్టుండి కన్నుమూయడంతో అందరు షాక్‌లో ఉన్నారు. వారం రోజుల క్రితం వైజాగ్ షూటింగ్ వెళ్లిన రాకేష్ మాస్టర్.. అక్కడి నుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా సిక్ అయ్యారు. ఆయనకి రక్త విరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆయనని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన బాడీలోని కొన్ని ఆర్గాన్స్ దెబ్బతినడంతో ఆదివారం సాయంత్రం 5గం.ల ప్రాంతంలో కన్నుమూసారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన దగ్గర శిష్యరికం పొందిన వాళ్ళే. అయితే కొన్ని కారణాల వల్ల శేఖర్ మాస్టర్- రాకేష్ మాస్టర్ మధ్య దూరం పెరిగింది. శేఖర్ మాస్టర్ పై రాకేష్ మాస్టర్ నిప్పులు చెరగడం చాలా సార్లు చూశాం. తనని మోసం చేశాడంటూ శేఖర్ మాస్టర్‌పై నిప్పులు చెరిగారు రాకేష్ మాస్టర్. అయితే అవేమి పట్టించుకోని శేఖర్ మాస్టర్ చివరి సారిగా రాకేష్ మాస్టర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. రాకేష్ మాస్టర్ ని చూసిన శేఖర్ మాస్టర్ కన్నీటి పర్యంతమయ్యారు. శేఖర్ మాస్టర్ జర్నీ రాకేష్ మాస్టర్ వద్ద మొదలైంది. కష్టసుఖాల్లో ఇద్దరూ కలిసి ఉన్నారు.
రాకేష్ మాస్టర్ ఇక లేరని తెలిసి ఆయనను చివరి చూపు చేసేందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేను చనిపోతే నా శవాన్ని కూడా శేఖర్ మాస్టర్ తాకొద్దు, ఇకపై నేను వాడిని కలవను అంటూ గతంలో శేఖర్ మాస్టర్‌పై నిప్పులు చెరిగారు రాకేష్ మాస్టర్.కాగా, సన్ స్ట్రోక్ వల్లనే రాకేష్ మాస్టర్ కన్ను మూసారని కొందరు చెబుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…