Rajeev Kanakala : సుమ, రాజీవ్‌ల తనయుడు రోషన్ కనకాల హీరోగా మానస చౌదరి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తూ.. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించిన చిత్రం బబుల్ గమ్. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తోంది. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ రీసెంట్‌గా నాని చేతుల మీదుగా విడుదలైంది. ప్రేమని బబుల్‌గమ్‌తో పోల్చుతూ టీజర్ మొదలైంది. స్టార్టింగ్‌లో తియ్యగుంటది. తర్వాత అంటుకుంటది.. షూస్ కింద.. థియేటర్లలో సీట్ల కింద.. అంత ఈజీ కాదు రరేయ్.. పండబెట్టేస్తది.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
యూత్‌ని టార్గెట్ చేసేలా ఈ టీజర్‌ని కట్ చేశారు. పీస్‌ఫుల్‌గా ఉంది కదా అని తినడానికి వచ్చినా.. కాస్త నెమ్మదిగా తింటా.. అనే డైలాగ్‌తో రోషన్ కనకాలను ఇందులో పరిచయం చేశారు. జాన్వీ, ఆదిత్య అని హీరోహీరోయిన్లు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఇద్దరు ప్రేమలో పడినట్లుగా చూపించారు. పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా.. పళ్లు తోముకోకపోయినా వచ్చి ముద్దు పెడతా.. అంటూ రోషన్ చెప్పిన డైలాగ్ హైలెట్ అయింది.హీరోహీరోయిన్ల మధ్య డీప్ లిప్‌లాక్ సీన్ చూపించిన వెంటనే.. విలన్‌ని ఓ బూతు తిట్టించి.. ‘నేను జనరల్‌గా ఇంత గలీజ్‌గా బిహేవ్ చేయను.. మాట్లాడను.. ఇంకెప్పుడూ అట్లా చేయను.. ఐ యామ్ రియల్లీ సారీ’ అని.. ప్రేక్షకులకు హీరో సారీ చెప్పినట్లుగా ఉండే సీన్‌తో టీజర్ ముగిసింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు అతనిపై ప్రశంసలు కురిపించారు.
టీజర్ రిలీజ్ అనంతరం ఈవెంట్‌లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ కొడుకుని అభినందించారు. టీజర్‌లో బాగా చేశావని, సినిమాలో కూడా బాగా చేసి ఉంటావని నమ్ముతున్నాన్నారు. అయితే టీజర్‌లో ఆఖరి షాట్ చూసి.. అంటూ కుర్రాళ్లని ఉద్దేశించి రాజీవ్ ఏదో చెప్పబోయి ఆపేశాడు. దీంతో పక్కనే ఉన్న సుమ కొన్ని మాట్లాడకుండా ఉంటేనే బెటర్ రాజా, పదా`అంటూ ఆమె సిగ్గుతో తలదించుకుని రాజీవ్‌ని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ జనరల్‌గా వాళ్లకి( ఆడియెన్స్ కి) అనిపించింది చెప్పాను. అవును కదా? అనగా, ఆడియెన్స్ నుంచి పెద్ద అరుపులు వచ్చాయి. దీనికి సుమ స్పందిస్తూ ఇంకా మనం ఏమేం చూడటానికి మిగిలుందో ? ఇది టీజర్ మాత్రమే అంటూ ఆమె తల కిందకు వేసి రాజీవ్ స్పీచ్‌ని ఆపే ప్రయత్నం చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…