Rajamouli : కాంతారా సినిమాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రాజ‌మౌళి.. ఏమ‌న్నారంటే..?

Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆయ‌న ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి హిట్ సాధించాడు. ప్ర‌స్తుతం మ‌హేష్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రం చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడు.మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న నేప‌థ్యంలో బ్లాక్ బస్టర్ హిట్ కాంతార సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారీ హిట్ అందుకోవాలంటే సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కించాల్సిన అవసరం లేదని.. కాంతార లాంటి చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాన్ని అందుకుంటాయని అన్నారు. దీనికి ఉదాహరణే 16 కోట్లతో తీసిన సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అని తెలిపాడు.

ప్రేక్షకుల్లో ఎంత‌ ఆతృత ఉన్నా..మనమేం చేస్తున్నామనేది పరిశీలించుకోవాలని రాజమౌళి తెలిపారు. సెప్టెంబర్ నెలలో విడుదలైన కాంతారా సినిమా..మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్‌ను పక్కనపడేసింది. ఈ సినిమా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా ప్రాచుర్యం పొందింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసిన రాజమౌళి..కాంతారా సినిమా విజయం సాధించడంతో ఇలా మాట్లాడటం సంచలనంగా మారింది. కంటెంట్ ముఖ్యం.. ప్రచారం కాదు. సినిమా అనేది ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించాలి. ఈ విషయాన్ని చిత్రనిర్మాతలుగా.. దర్శకులుగా మనం ఎలా సినిమాను రూపొందిస్తున్నామనేది నిత్యం తనిఖీ చేయాలి” అని అన్నారు రాజ‌మౌళి.

Rajamouli sensational comments on kantara
Rajamouli

కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారాపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 16 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన కాంతార సినిమా మన సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ఎలివేట్ చేస్తూనే చ‌క్క‌టి క‌థ‌, పెర్ఫామెన్స్‌తో ఆడియెన్స్‌ను ఎంత‌గానో అల‌రించింది. పాన్ ఇండియా రేంజ్‌లో క‌న్న‌డ మిన‌హా మిగిలిన అన్నీ భాష‌ల్లో అనువాద‌మై ఏకంగా రూ.400 కోట్ల మేర‌కు వ‌సూళ్ల‌ను సాధించి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త వ‌సూళ్ల సునామీని సృష్టించ‌డంతో ఈ సినిమాపై అంద‌రి దృష్టి ప‌డింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ కాంతార సినిమాను తెరకెక్కించారు. హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago