Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి హిట్ సాధించాడు. ప్రస్తుతం మహేష్‌తో భారీ బడ్జెట్ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నాడు.మరోవైపు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో బ్లాక్ బస్టర్ హిట్ కాంతార సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారీ హిట్ అందుకోవాలంటే సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కించాల్సిన అవసరం లేదని.. కాంతార లాంటి చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాన్ని అందుకుంటాయని అన్నారు. దీనికి ఉదాహరణే 16 కోట్లతో తీసిన సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అని తెలిపాడు.
ప్రేక్షకుల్లో ఎంత ఆతృత ఉన్నా..మనమేం చేస్తున్నామనేది పరిశీలించుకోవాలని రాజమౌళి తెలిపారు. సెప్టెంబర్ నెలలో విడుదలైన కాంతారా సినిమా..మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్‌ను పక్కనపడేసింది. ఈ సినిమా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా ప్రాచుర్యం పొందింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసిన రాజమౌళి..కాంతారా సినిమా విజయం సాధించడంతో ఇలా మాట్లాడటం సంచలనంగా మారింది. కంటెంట్ ముఖ్యం.. ప్రచారం కాదు. సినిమా అనేది ప్రేక్షకులకు ఉత్సాహాన్ని కలిగించాలి. ఈ విషయాన్ని చిత్రనిర్మాతలుగా.. దర్శకులుగా మనం ఎలా సినిమాను రూపొందిస్తున్నామనేది నిత్యం తనిఖీ చేయాలి” అని అన్నారు రాజమౌళి.
కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారాపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కాంతార సినిమా మన సంస్కృతి, సంప్రదాయాలను ఎలివేట్ చేస్తూనే చక్కటి కథ, పెర్ఫామెన్స్‌తో ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించింది. పాన్ ఇండియా రేంజ్‌లో కన్నడ మినహా మిగిలిన అన్నీ భాషల్లో అనువాదమై ఏకంగా రూ.400 కోట్ల మేరకు వసూళ్లను సాధించి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త వసూళ్ల సునామీని సృష్టించడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ కాంతార సినిమాను తెరకెక్కించారు. హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.