Rahul Ravindran : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా పెద్ద వివాదంలో ఇరుక్కుంది. మయోసైటిస్ బారిన పడ్డ ఈ ముద్దుగుమ్మ ఇన్ఫెక్షన్లను ఏ విధంగా నయం చేసుకోవచ్చో చెబుతూ ఓ హెల్త్ టిప్ చెబుతూ ఓ ఫొటో పోస్ట్ చేసింది. అది చూసిన ఓ డాక్టర్ మండిపడ్డారు. ఆమెను జైల్లో పెట్టాలంటూ సీరియస్ అయ్యారు. ఆమెకు జరిమానా కూడా విధించాలని చెప్పుకొచ్చారు. దాంతో సమంత మంచి చేద్దామని వెళ్తే చెడు ఎదురైన పరిస్దితి వచ్చింది. డాక్టర్ కామెంట్‌పై స్పందించిన సమంత.. కొన్నేళ్లుగా నేను అనేక రకాల మందులు వేసుకుంటున్నాను. ప్రతి దాన్ని డాక్టర్ల సలహా మేరకు ఉపయోగిస్తున్నా. ఇతరులకు ఇచ్చే టిప్స్ కూడా నేను పాటించి ఫలితం వచ్చిన తర్వాతనే చెప్పాను.
నేను తీసుకుంటున్న వైద్యం చాలా ఖరీదైనది. నాకు ఆర్థికస్థోమత ఉంది కాబట్టి దాన్ని భరించగలను. కానీ, కొందరి పరిస్థితి వేరు. ఇంత ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోలేరు. వాళ్ల గురించే నేను ఆలోచించి హెల్త్ టిప్స్ చెబుతుంటాను. దేని గురించైనా తెలుసుకోకుండా ఇతరులకు సలహా ఇచ్చేంత అమాయకురాలిని కాదు. నేను చికిత్స తీసుకుంటున్న డాక్టర్‌కు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది’ అని తెలిపారు. ఒక పెద్దమనిషి నా పోస్ట్‌ను, నా సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారు. ఆయన కూడా డాక్టరే. నాకంటే ఆయనకు ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది అని చెప్పుకొచ్చింది.
ఇక సమంతకి సపోర్ట్‌గా రాహుల్ రవీంద్రన్ కౌంటర్ ఇచ్చాడు. “ఈ విషయం గురించి సమంత ట్యాగ్ చేసిన డాక్టర్‌తో వాదిస్తే మంచిది” అని సమంతకు రాహుల్ రవీంద్రను మద్దతుగా నిలిచాడు. డాక్టర్‌కు కౌంటర్ ఇస్తూ తన స్నేహితురాలికి అండగా నిలిచాడు రాహుల్ రవీంద్రన్. అర్హత కలిగిన వైద్యులే భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు మనం ఇలాంటి సలహాలపైనే ఆధారపడతాం.ఒకవేళ సమంత చెప్పేది తప్పైతే నేనే హెచ్చరిస్తా. కోవిడ్ వ్యాక్సిన్ ల నుండి సైన్స్‌పై ఆధారపడిన ప్రత్యామ్నాయ చికిత్సల వరకు సైంటిఫిక్ కమ్యూనిటీలో భిన్నాబిప్రాయాలు ఉంటే ఎవరిని నమ్మాలి అని చెబుతూ సమంతకి మద్దతుగా నిలుస్తూ రాహుల్ చెప్పారు. అయితే రాహుల్ భార్య చిన్మయికి సమంత ఫ్రెండ్ కాబట్టి ఆమెకి మద్దతుగా నిలిచాడని ఆయనపై కూడా తెగ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…