Shyamala Devi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. బ్రేకుల్లేని బండిలా బాక్సాఫీస్‌ను దున్నేస్తుంది కల్కి చిత్రం. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి హవానే కనిపిస్తుంది. అయితే కల్కితో పాటు జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ట్రెండ్ అవుతున్నారు. ప్రభాస్ పని బాహుబలితోనే అయిపోయిందని.. ఆయన తన కెరీర్‌లో చూడాల్సిన పీక్స్ చూసేశారని వేణుస్వామి అన్నారు. అలానే ఇక ప్రభాస్‌తో సినిమాలు చేసే నిర్మాతలు ఆలోచించాల్సిందే అంటూ వేణుస్వామి ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అయితే కట్ చేస్త్ మొన్న సలార్, ఇప్పుడు కల్కితో ప్రభాస్ వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టారు. దీంతో వేణుస్వామిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణం రాజు భార్య శ్యామలా దేవి కూడా వేణుస్వామికి ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు.
రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి అతని అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. గతేడాది అతని పెళ్లవడం ఖాయం అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొందరైతే ప్రభాస్ కు ఇక పెళ్లి జరగదని కూడా అన్నారు. బాహుబలి తర్వాత అతడు మళ్లీ సక్సెస్ చూడడని కూడా చెప్పారు. కానీ సలార్, కల్కి 2898 ఏడీతో అది తప్పని నిరూపించాడు. అలాగే ప్రభాస్ పెళ్లి కూడా జరుగుతుందని శ్యామలా దేవి చెప్పారు. ఈ మధ్య ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కల్కి సక్సెస్, ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు. “ఓ మనిషి మంచితనం అనేది ఎంతవరకూ తీసుకెళ్తుందో కల్కి విజయం చూపించింది. కొందరు బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్లీ విజయం చూడడు అని అన్నారు. కానీ వాళ్ల అంచనాలు తారుమారయ్యాయి. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అదే జరుగుతుంది” అని ఆమె అనడం విశేషం.
దానికి కూడా టైమ్ రావాలని అని అన్నారు. “మేము కూడా అతడు పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటున్నాం. కానీ సమయం రావాలి కదా. మేము ఆ నమ్మకంతోనే ఉన్నాం. పైనున్న కృష్ణంరాజుగారు అన్నీ చూసుకుంటారు. ఇప్పటి వరకూ అనుకున్నవన్నీ జరిగాయి. పెళ్లి కూడా కచ్చితంగా జరుగుతుంది” అని శ్యామలా దేవి చెప్పారు. నిజానికి గతేడాది కూడా ఆమె ప్రభాస్ పెళ్లి త్వరలోనే అన్నట్లుగా మాట్లాడారు. మరి ఆమె మాటలు ఎప్పుడు నిజమవుతాయో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…