Balakrishna : నందమూరి బాలకృష్ణకి కోపమని, ఆయన అభిమానులపై చేయి కూడా చేసుకుంటాడని కొందరు యాంటీ ఫ్యాన్స్ తెగ విమర్శలు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో అభిమానులపై చూపించే ప్రేమానురాగాలకు అవధులు ఉండవనే చెప్పాలి. ఇటీవల బాలయ్య సినిమా షూటింగ్లో ఉండగా, అక్కడికి తన అభిమాని కుటుంబం రాగా వారితో కలిసి భోజనం చేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో నందమూరి బాలకృష్ణ 109 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదోని పట్టణానికి చెందిన నందమూని యువసేన సేవా సంస్థ అధ్యక్షులు సజ్జాద్ కు బాలకృష్ణ నుంచి పిలుపు వచ్చింది.
దీంతో భార్య, కొడుకుతో కలిసి సజ్జాద్ బాలకృష్ణ ఘూటింగ్ స్పాట్లో వెళ్లి కలిశారు. అనంతరం ఆ అభిమాని కుటుంబంతో కలిసి ఆప్యాయంగా మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ భోజనం చేశారు. అలాగే సజ్జద్ కుమారుడి గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదివించి పెద్దవాడిని చేయాలని ఈ సందర్భంగా సజ్జద్ కు బాలయ్య సూచించారు. రాజకీయాలు, సినిమాలతో ఎప్పుడు బీజీగా ఉండే బాలకృష్ణ తన అభిమానులను గుర్తుంచుకొని ఆప్యాయంగా పలకరించాటం జీవితంలో మర్చిపోలేని సంఘటన అని సజ్జద్ అన్నారు. ఇక తాజాగా బాలకృష్ణ మంచి మనసుకి సంబంధించిన సాక్ష్యం ఒకటి బయటకు వచ్చింది.
బాలకృష్ణ ఒక వృద్ధ మహిళ పక్కన కూర్చుని ఆమెతో ఉల్లాసంగా గడపడం మనం చూడవచ్చు. ఆ వృద్ధురాలు బాలయ్య వేసిన జోక్‌కి తెగ నవ్వుతోంది. ఇందుకు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక హిందూపురం నియోజక వర్గంలో భారీ మెజారిటీతో ముచ్చటగా మూడో సారి గెలిచిన బాలయ్య అక్కడి ప్రజలతో మమేకమవుతున్నారు. తన సినిమా కమిట్‌మెంట్‌లు ఉన్నప్పటికీ, బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురం అభివృద్ధికి హామీ ఇచ్చారు, దాని కారణంగా అతను మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బాలయ్య 109వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…